ఇదేం దారుణం.. టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని వంద కొబ్బ‌రి చెట్ల న‌రికివేత‌

రాజ‌కీయాలు అంటేనే శ‌తృభావాన్ని పెంచేస్తాయి.ఇప్పుడు మ‌న దేశంలో ఉన్న రాజ‌కీయాలు ఇలాంటివే.

 This Is Atrocious One Hundred Coconut Trees Cut Down For Supporting Tdp Details,-TeluguStop.com

ఒక పార్టీలో ఉన్న వారికి ఆటోమేటిక్‌గా ఇత‌ర పార్టీల్లో ఉన్న వారు ప్ర‌త్య‌ర్థులు అవుతారు.ఇవే కొన్నిసార్లు శ‌తృత్వానికి దారి తీస్తాయి.

వాటిని మొద‌ట్లోనే ప‌రిష్క‌రించుకోక‌పోతే ఎంత‌టి దారుణాలకు దారి తీస్తాయో అంద‌రికీ తెలిసిందే.ఇందుకు నిద‌ర్శ‌నంగా ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి.

ఏపీలో ఇప్పుడు రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌లు ఎంత‌లా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న మాదిరిగా రాజ‌కీయాలు ఉన్నాయి.

ఇరు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏకంగా దాడుల‌కు కూడా దిగుతున్నారు.కాగా ఇప్పుడు విజయనగరంలో చోటు చేసుకున్న ఉదంతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఏంటంటే ఈ జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి చెందిన‌టువంటి వెళ్దూరు గ్రామంలోనే వ్య‌క్తిగ‌తంగా దాడులు జ‌రుగుతున్నాయి.అయితే ఈ ఊరిలో రాజ‌కీయ చైత‌న్యం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇందుకు త‌గ్గ‌ట్టే ఊర్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న మాదిరిగా రాజ‌కీయాలు న‌డుస్తుంటాయి.ఇందులో భాగంగా వెంకటయ్యరెడ్డి అనే వ్య‌క్తికి సంబంధించిన కొబ్బరి తోటలో దాదాపు 100 చెట్ల‌ను న‌రికేశారు.

ఆయ‌న మొన్న ఊర్లో జ‌రిగిన‌టువంటి పంచాయతీ ఎల‌క్ష‌న్ల‌లో వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశాడు.

Telugu Coconut Trees, Ap, Tdp, Velduru, Vijayanagaram, Ycp Tdp-Latest News - Tel

ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి స‌పోర్టు చేయ‌డంతో త‌న తోట‌ను ప్ర‌త్య‌ర్థులే న‌రికేశారంటూ వాపోతున్నాడు వెంక‌టయ్య‌.వైసీపీ పార్టీకి చెందిన త‌మ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ఇలా చేసిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.కాగా దీనిపై ఇప్పుడు స్థానికంగా టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగుతున్నారు.

ఈ ఉదంతం ఇప్పుడు జిల్లాలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.ఇరు పార్టీల నేత‌లు భ‌గ్గుమంటున్నారు.

దీనిపై పోలీసులు కూడా కేసు న‌మోదు చేసుకున్నారు.ఇలా వ్య‌క్తిగ‌త దాడుల నుంచి ఆస్తి న‌ష్టాల‌వైపు రాజ‌కీయాలు దారి తీస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube