ఉన్న‌దాంట్లో సంతృప్తిగా బ‌త‌కడమే గొప్ప అని చెప్పే వీడియో ఇది..

జీవితం అంటేనే సంతృప్తిగా బ‌త‌క‌డం.ఎప్పుడు పోతామో ఎవ‌రికీ తెలియని జీవితంలో ఉన్న‌తంత‌లో జీవితాన్ని సంతృప్తిగా గ‌డిపిన వ్య‌క్తుల జీవిత‌మే సార్థ‌కం అవుతుంది.

 This Is A Video That Says That It Is Great To Be Satisfied With What You Have. Viral Wedding, Inspirational Story , Marrege , Simple , Viral , Viral In Internet,great To Be Satisfied-TeluguStop.com

అంతే గానీ అంద‌ని దాని కోంస జీవితం మొత్తం వృథా చేసుకుంటే మిగిలేది ఏమీ ఉండ‌దు.ఎందుకంటే జీవితంలో గ‌డిచిపోయిన క్ష‌ణాలు తిరిగి రావు క‌దా.

అందుకే మ‌న జీవితంలో ఎదురయ్యే ప్ర‌తి క్ష‌ణాన్ని, ప్ర‌తి మూమెంట్ ను ఎంజాయ్ చేయాల‌ని పెద్ద‌లు చెబుతారు.అలా కాద‌ని మ‌న ద‌గ్గ‌ర లేని దాని కోసం ఆరాట ప‌డితే జీవితం మొత్తం ఆరాటంలోనే గ‌డిచిపోతుంది.

 This Is A Video That Says That It Is Great To Be Satisfied With What You Have. Viral Wedding, Inspirational Story , Marrege , Simple , Viral , Viral In Internet,great To Be Satisfied -ఉన్న‌దాంట్లో సంతృప్తిగా బ‌త‌కడమే గొప్ప అని చెప్పే వీడియో ఇది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇలా ఉన్న‌తంత‌లో సంతోషంగా జీవించే వారి సంఖ్య ఇప్ప‌టి త‌రంలో చాలా త‌గ్గిపోతోంది.ఇప్ప‌టి త‌రం మొత్తం డ‌బ్బు వెన‌కాలే ప‌రుగెడుతోంది.త‌మ‌కు డ‌బ్బులు ఉంటే చాలాని అన్న‌ట్టు త‌య‌రావుతోంది.కాగా ఇప్పుడు ఓ వీడియోసోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అవుతోంది.

ఇది ఓ పెళ్లికి సంబంధించినది.దీన్ని చూస్తే ఉన్నంత‌లో ఎంత సంతోషంగా గ‌డ‌పొచ్చో తెలుస్తోంది.

పెండ్లి అంటే ఇవాళ రేపు ఎంత‌లా ఖ‌ర్చు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం.అయితే ఇందులో పెండ్లి మాత్రం చాలా స్పెషల్‌గా జ‌రిగింది.

ఈ వైర‌ల్ వీడియోలో కొత్త దంప‌తులను ఊరేగింపులో న‌డుచుకుంటూ తీసుకురావ‌డం క‌నిపిస్తుంది.చూడ‌టానికి చాలా పేద కుటుంబం అని తెలుస్తోంది.అయినా స‌రే త‌మ‌కు ఉన్నంత‌లో ఎలా గ్రాండ్ గా చేసుకోవచ్చో వీరు నిరూపించారు.త‌మ‌కు వెళ్ల‌డానికి కారు లేక‌పోయినా న‌డుచుకుంటూ వెళ్తున్నారు.అయితే వారి వెన‌కాల రెండు స్పీకర్ల‌ను కొంద‌రు కుర్రాళ్లు క‌ర్ర‌ల సాయంతో ప‌ట్టుకుని వెన‌కాలే వ‌స్తుంటారు.అందులో పాట‌లు ప్లే అవుతున్నాయి.

అంటే వెహిక‌ల్ పెట్టుకునే స్తోమ‌త లేక‌పోయినా ఇలా త‌మ‌కు ఉన్నంత‌లో ఆలోచన చేసి సంతృప్తిగా పెండ్లి జ‌రిపించుకున్నారన్న మాట‌.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube