ఒకరికి సాయం చేస్తే అదెక్క‌డికి పోద‌ని చెప్పే వీడియో ఇది..

This Is A Video That Says If You Help Someone You Will Succeed

ఈ ప్ర‌పంచంలో సాటి వారికి సాయం చేస్తే అంత‌కు మించిన పుణ్యకార్యం మ‌రొక‌టి ఉండ‌ద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు.అయితే మ‌నం అలా చేసిన సాయం ఎక్క‌డికి పోకుండా ఏదో ఒక రూపంలో మ‌న‌కు చేరుతుంద‌నే వాద‌న కూడా ఎప్ప‌టి నుంచో ఉంది.

 This Is A Video That Says If You Help Someone You Will Succeed-TeluguStop.com

కానీ ఇవాళ రేపు మ‌నుషులు ఎలా ఉంటున్నారో చూస్తున్నాం.సాటి వారు ఎంత ప్ర‌మాదంలో ఉన్నా స‌రే చూసి కూడా ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా దూరంగానే ఉంటున్నారు.

అయితే ఇలాంటి వారికి ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం వింటే మాత్రం నిజంగా సాయం చేయాల‌నే ఆలోచ‌న పుడుతుంది.

 This Is A Video That Says If You Help Someone You Will Succeed-ఒకరికి సాయం చేస్తే అదెక్క‌డికి పోద‌ని చెప్పే వీడియో ఇది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

అయితే ఒక్క‌టే వీడియోలో మ‌నం ఎదుటి వారికి సాయం చేస్తే అది ప్ర‌కృతి రూపంలో మ‌న‌కు సాయం చేస్తుంద‌ని ఈ వీడియో క్లియ‌ర్ గా చెబుతోంది.పైగా ఇదేదో ఆర్టిఫిషియ‌ల్ వీడియో కాదండోయ్‌.

సహ‌జంగానే జ‌రిగింది.అందుకే ఇది అంత‌లా ఫేమ‌స్ అవుతోంది.

వీడియోలో ఓ రోడ్డు ప‌క్క‌న ఓ జంట వాదులాడుకుంటారు.కాగా అదే స‌మ‌యంలో ఓ వృద్ధ మహిళ అటు వ‌స్తూ రోడ్డు మీద కూరగాయల బ్యాగ్ ప‌డిపోతుంది.ఇంకేముంది అందులోని వ‌స్తువులు మొత్తం కింద ప‌డిపోతాయి.

ఇక ఆ జంట‌లోని అమ్మాయి ఆ వృద్ధురాలికి సాయం చేయడానికి ప్రయత్నించ‌గా.అబ్బాయి మాత్రం వ‌ద్దు అన్న‌ట్టు ఆమెను చేయి ప‌ట్టుకుని లాగేస్తుంటాడు.అయితే ఆ అమ్మాయి మాత్రం అత‌న్ని ప‌ట్టించుకోకుండా ఎలాగోలా అత‌ని చేయిని విడిపించుకుని ఆమె వ‌ద్ద‌కు వెళ్లి సాయం చేస్తుంది.

ఇక ఆ అమ్మాయి వెంటే అబ్బాయి కూడా అక్క‌డ‌కు వ‌స్తాడు.వీరిద్ద‌రూ ఇలా జ‌రుగుతారో లేదో అప్ప‌టి వ‌ర‌కు తాము నిల్చున్న చోట ఒక పెద్ద బ్యానర్ బాక్స్ కింద ప‌డుతుంది.

వారు అక్క‌డే ఉంటే ఖచ్చితంగా వారి త‌ల మీద అది ప‌డి ఉండేది.అంటే ఆ వృద్దురాలికి సాయం చేయ‌డానికి వెళ్తే అదే త‌మ‌ను కాపాడింద‌న్న‌మాట‌.

#Escapes #Box #Humanity #Vegetables Bag #Road

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube