ఇదేం వింత గ్రామం.. ఒక‌రు చ‌నిపోయిన వెంట‌నే మ‌రొక‌రు కాటికి..

ఈ ప్ర‌పంచంలో చాలా ర‌కాల వింత గ్రామాలు ఉంటాయి.అందులో ఇప్పుడు ఓ గ్రామం గురించి మ‌నం చెప్పుకోబుతున్నాం.

 This Is A Strange Village As Soon As One Dies Another One Death, Strange Village-TeluguStop.com

గ్రామంలో వింత ఘ‌ట‌న‌లు చేసుకుంటున్నాయిని చెబుతున్నారు.అదేంటంటే ఈ గ్రామంలో పొర‌పాటున ఎవ‌రైనా చనిపోతే అత‌న్ని కాల్చేయ‌క‌ముందే మరొకరు చనిపోవ‌డం సంచ‌ల‌నాల‌కు తెర లేపుతోంది.

అయితే ఈ గ్రామంలో ఈ ఘ‌ట‌న‌లు వందల ఏండ్లుగా కొన‌సాగుతోందంట‌.అస‌లు ఈ ఊరిలో ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావడం లేదు.

ఈ ఊరిలో ఎవరైనా క‌న్నుమూస్తే ఆ రోజు చ‌నిపోవ‌డ‌మో లేదంటే చాలా కొద్ది రోజుల్లోనే మరొకరు మ‌ర‌ణిస్తున్నారంట‌.

ఇలా కీడు జ‌రుగుతున్నందున ఈ ఊరి గ్రామ‌స్తులు ఎన్నో శాంతి పూజ‌లు చేయించారు.

కానీ ఈ విధ‌మైన మరణాలు మాత్రం ఆగట్లేద‌ని వాపోతున్నారు.అయితే ఈ వింత ఊరు మంచిర్యాల జిల్లాలో ఉన్న నెన్నెల గ్రామం గ‌మ‌నార్హం.

ఇక ఈ ఊరిలో ఎవ‌రైనా చ‌నిపోతే గ‌న‌క తెల్లారితే ఎవరి వంతు వ‌స్తుందో అనే భయం ఆ ఊరిని నిద్రపోనివ్వ‌ట్లేదు.అయితే ఈ గ్రామం ఏర్ప‌డి ఇప్ప‌టికి 500 ఏండ్లు అవుతుంద‌ట‌.

ఈ విధ‌మైన వ‌రుస చావుల వెన‌క ఉన్న మ‌ర్మం ఏమిలో అంతు పట్టటం లేదని ఎంత మందికి చూపించినా ఇది మాత్రం ఆగ‌ట్లేద‌ని వెల్ల‌డిస్తున్నారు.

Telugu Mancherial, Mistory, Nennela, Strange Nennela, Strange-Latest News - Telu

ఇక హేతువాదుల లాంటివారు ఇది మూఢనమ్మకంగా భావించారు.కానీ వ‌రుస మ‌ర‌ణాల‌కు సాక్ష్యాలూ, ఆధారాలు కూడా చూపించ‌డంతో న‌మ్మ‌క త‌ప్ప‌ట్లేదు.పోనీ ఊరికి వాస్తుపరంగా ఏదైనా దోషాలు ఉన్నాయ‌ని, దేశంలో ప్ర‌ముఖులైన వేద పండితులతో కూడా ఎన్నో పూజలు చేయించారు.

కానీ ఆ ఊరికి పట్టిన మహమ్మారి మాత్రం వ‌ద‌ల‌ట్లేదు.ఏ క్ష‌ణం ఎవ‌రి ఇంట్లో చావు డ‌ప్పుడు మోగుతాయో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.పంచాయతీ మరణ ధ్రువీకరణ బుక్కులో ఈ విధ‌మైన జంట మ‌ర‌ణాలు క‌నిపిస్తున్నాయి.ఒక వ్య‌క్తి చ‌నిపోయిన 24 గంటల వ్యవధిలో లేదంటో వారం వ్య‌వ‌ధిలో చనిపోతున్నారట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube