వైరల్‌ ఫొటో స్టోరీ : కఠినాత్ములకైనా కన్నీరు పెట్టించే సన్నివేశం ఇది

ఎంత అభివృద్ది చెందితే ఏం లాభం.ఎన్ని ప్రయోగాలు చేస్తే ఏం ఉపయోగం మూగ జీవాలను కాపాడుకోలేక పోయిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉండి వృదా అంటూ నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 This Is A Scene That Will Bring Tears To The Ladies-TeluguStop.com

గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వేలాది ఎకరాల్లో ఉన్న అడవులను దహించి వేస్తున్న విషయం తెల్సిందే.అడులతో పాటు ఎన్నో రకాల అద్బుతమైన జంతుజాలం కూడా అంతరించి పోతుంది.అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 50 కోట్ల జంతువులు ఈ కార్చిచ్చు వల్ల కాలి బూడిద అయ్యి ఉంటాయి అంటున్నారు.

100 కోట్ల జంతువులు మృతి చెంది ఉంటాయని మరికొందరు అంటున్నారు.ఏది ఏమైనా ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ జంతు నాశనం సృష్టి వినాశనం అయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు చేస్తున్నారు.ఆస్ట్రేలియా కార్చిచ్చులో చనిపోతున్న జంతువుల కళేభరాలు చూస్తుంటే కళ్లు చెమర్చకుండా ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా కార్చిచ్చు నుండి కోలా అనే జాతికి చెందిన జంతువును కాపాడి తీసుకు వచ్చారు.తల్లి కోలా తీవ్రంగా గాయపడటంతో వైధ్యులు దానికి చికిత్స అందిస్తున్నారు.

Telugu Scene Tears, Telugu Ups-General-Telugu

తల్లి కోలా గాయాలతో కళ్లు తెరవకుండా ఉండటంతో పిల్ల కోలా తల్లిని హత్తుకుని పడుకోవడం అందరిని కదిలించింది.ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీరు తిరిగేలా చేసింది.మనుషులకు మాత్రమే కాకుండా జంతువుల్లో కూడా కన్న ప్రేమ, తల్లి ప్రేమ ఉంటాయని ఈ ఫొటో నిరూపిస్తుందని, ఇలా ఇంకా ఎన్ని జంతువులు తల్లులను కోల్పోవాలి, పిల్లలను కోల్పోవాలంటూ ఆస్ట్రేలియా సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోక పోవడం వల్ల ఇప్పటికే కోట్లాది వన్య ప్రాణులు మృతి చెందాయి అంటున్నారు.

ప్రస్తుతం ఈ కోలాల ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube