నాకు ఇది పునర్జన్మ.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్?

నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు.ఇప్పటికే ఈయన పరిచయం చేస్తున్న ఎందరో డైరెక్టర్లు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు.

 This Is A Rebirth For Me Kalyan Rams Emotional Post Kalyan Ram,tollywood,young T-TeluguStop.com

తాజాగా ఈయన వశిష్ట అనే దర్శకుడికి కూడా అవకాశం ఇచ్చి ఆయన దర్శకత్వంలో సొంత బ్యానర్ లోనే బింబిసారా అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమా విడుదలైన రెండు రోజులలోనే పెట్టుబడిని రాబట్టి లాభాల బాటలో దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా సక్సెస్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున నందమూరి కళ్యాణ్ రామ్ నటన పై ప్రశంసలు కురిపించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ మెగాస్టార్ వంటి సీనియర్ హీరోలు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Telugu Allu Arjun, Kalyan Ram, Tollywood, Young Tiger-Movie

ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు అభిమానులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా విజయం పై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… తోటి హీరోల నుంచి ఈ సినిమాకి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఇది నాకు పునర్జన్మ లాగ ఉంది.ఈ విధంగా సినిమాపై ప్రశంసలు కురిపించడంతో నాకు మరింత బలాన్ని చేకూర్చాయని ఇదే బలంతో నమ్మకంతో మరి కొన్ని కొత్త సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తానని ఈ సందర్భంగా కళ్యాణ్ బింబిసారా సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube