ఆదివారం వచ్చిందంటే చాలు మన ఇంట్లో చికెన్ ముక్క ఉడుకాల్సిందే.లేకపోతే ముద్ద దిగదు మనందరికీ.
అంత దాకా ఎందుకు ఎలాంటి ఫంక్షన్ అయినా లేదంటే పార్టీ అయినా సరే ఏ చిన్న హ్యాపీ మూమెంట్ అయినా మనకు చికెన్ తోనే ఫుల్ ఫిల్ అయినట్లు ఫీల్ వస్తుంది.అందుకే అది మన దైనందిన జీవితంలో భాగం అయిపోయింది.
మన దేశంలో దీని వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.పైగా పెండ్లిల సమయలంలో అయితే వందలాది కోళ్లు చికెన్ కూరగా మారాల్సిందే.
అయితే మనం ఇంతలా తినేస్తున్న కోళ్లకు మనోభావాలు ఉండవా అనేది ఇప్పుడు ప్రశ్న.
మామూలుగానే చిన్న దెబ్బ తలిగితేనే ఎంతో విలవిలలాడిపోతుంటాం మనం.
అలాంటిది కోళ్లు తమ ప్రాణాలు పోతున్నాయని తెలిసినా తప్పదన్నట్టుగా ఉండిపోతున్నాయి.అయితే ఇప్పుడు ఓ కోడిపిల్ల మాత్రం తమకు జరుగుతున్న అన్యాయం మీద ఏడుస్తోంది.
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.ఇప్పుడు మనం చూడబోయే వీడియోమాత్రం ఇందుకు సింక్ అయ్యే విధంగానే ఉంటోంది.
ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా అయ్యో పాపం అనిపించక మానదేమో.తమను అన్యాయంగా చంపేస్తున్నారంటూ ఆ కోడిపిల్ల ఏడుస్తున్నట్టు ఉంది ఆ వీడియో.
ఈ వైరల్ వీడియోలో ఓ టర్కీ కోడి తనకు దగ్గరలోని ఓ వ్యక్తి ఒడిలో తలపెట్టి ఏడుస్తున్నట్టు మనకు ఇందులో కనిపిస్తుంది.అయితే ఆ కోడిపిల్లను చూస్తుంటే మాత్రం తనను బయటకు వెళ్తే చంపేస్తారని, అందుకే ఇక్కడే సేఫ్ గా ఉన్నట్టు ఏడుస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇక దాన్ని ఓ వ్యక్తి మాత్రం చేతితో నిమురుతూ ఉంటాడు.ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అయిపోయింది.
ఇప్పటికే దీన్ని 60వేల మంది చూశారు.దాని మీద రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇక నెటిజన్లు చాలామంది తాము ఇకమీదట చికెన్ తినబోమంటూ శపథాలు కూడా చేసేస్తున్నారండోయ్.