ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సాధారణంగా హీరోయిన్లు అంటే అందంగా ఉంటారు.అయితే ఆ అందాన్ని మరింత అందంగా మార్చుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.

 Tollywood Heroins, Plastic Surgery, Asin, Shriya Saran, Samantha, Nayanatara, Sh-TeluguStop.com

ప్లాస్టిక్ సర్జరీ అందాలే ఆయా హీరోయిన్లు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమయ్యాయి.అందంగా ఉంటే దశాబ్దమైనా హీరోయిన్ గా రాణించేందుకు అవకాశం ఉంటుంది.అందువల్లే నేటి తరం హీరోయిన్లు అందం కోసం ఎంతైనా వెచ్చిస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటున్నారు.

శృతిహాసన్

: కమల్ హాసన్ కూతురిగా, స్టార్ హీరోయిన్ గా, సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్టు శృతిహాసన్ బహిరంగంగా వెల్లడించారు.పెదాలతో పాటు ముక్కుకు కూడా శృతి కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారు.2009లో బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ సినిమాలతో శృతి కెరీర్ ను ప్రారంభించారు.ఆ సినిమాలో శృతి లుక్స్ పై కొంత విమర్శలు రావడంతో తరువాత కాలంలో ఆమె సర్జరీ చేయించుకున్నారు.

నయనతార

: 2003లో మలయాళం సినిమాతో నయన్ తన ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించింది.చంద్రముఖి సినిమాలో నటించిన తరువాత నయనతార ప్లాస్టిక్ సర్జరీ ద్వారా లోపాలను సరి చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఆ తరువాత కూడా నయన్ పలుమార్లు ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుంది.ఈ ప్లాస్టిక్ సర్జరీల వల్లే ఇప్పటికీ నయన్ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది.

సమంత

: టాలీవుడ్ లో నేటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత 2012లో ముక్కుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది.ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సామ్ అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది.

శ్రియ

: టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా అవకాశాలు అందుకున్న నటీమణులలో శ్రియ ఒకరు.మల్లన్న సినిమాకు ముందు శ్రియ సర్జరీ ద్వారా పెదాల రూపాన్ని మార్చుకున్నారు.పై పెదవిని విల్లు రూపంలో మార్చుకుని శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ నేటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

అసిన్

: 2001లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన అసిన్ వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.ఘర్షణ, శివమణి, గజిని, అన్నవరం సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టారు.

బాలీవుడ్ లో అడుగు పెట్టిన తరువాత అసిన్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రూపురేఖలను మార్చుకుని అక్కడ స్టార్ హీరోయిన్ గా అవకాశాలను అందుకుని ఎదిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube