కువైట్ లో ఇదీ జరిగింది...అందుకే 192 మంది ప్రవాసులు అరెస్ట్....

వేరే దేశానికి పనికి కోసం వలస వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం చెప్పిన విధి,విధానాలు పాటించటం తప్పనిసరి.వాటిని మీరి ప్రవర్తిస్తే ఏ దేశమైన చట్టబద్దమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది.

 This Happened In Kuwait Hence The Arrest Of 192 Expatriates , Gulf, Kuwait, Assi-TeluguStop.com

నివసించే ప్రదేశం, చేసే పని, పని ఇచ్చిన యజమానుల విషయం లో కచ్చితత్వాన్ని పాటించటం ప్రవాసుల భాద్యత.అయితే గల్ఫ్ దేశమైన కువైట్ లో కొంతమంది ప్రవాసులు దీనిని పాటించకుండా తమకు నచ్చినట్టు నడుచుకున్నారు, చివరకు జైలుకు వెళ్లారు.

అసలేం జరిగిందంటే, కువైట్ లో 192 మంది ప్రవాసులు రెసిడెన్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.వారి స్పొంసర్స్ నుంచి తప్పించుకొని బయట వారి దగ్గర పని చేస్తూ దొరికిపోయారు.

పని ఇచ్చిన యజమాని నుంచి తప్పించుకొని వేరే వారి దగ్గర పని చేస్తున్నారు.రెసిడెన్స్ ఉల్లంఘనదారులే లక్ష్యం గా ప్రజా భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ ఫర్రాజ్ అల్ జౌబీ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో అంతర్గత మంత్రిత్వ శాక ఈ ఉల్లంఘనాదారులను అరెస్ట్ చేసింది.

ఈ సోదాలను అహ్మదీ డిరేక్టరేట్, ముబారక్ అల్ కబీర్ ప్రాతాలలో నిర్వహించారు.

అయితే, అహ్మదీ డిరేక్టరేట్-74 మందిని, ముబారక్ అల్ కబీర్ ప్రాంతాలలో 118 మంది, మొత్తం 192 మంది ప్రవాసులను అదుపులోనికి తీసుకున్నారు.

ఫర్రాజ్ అల్ జౌబీ మాట్లాడుతూ, చాల గృహకార్మికులు యజమానుల నుంచి తప్పించుకొని బయట పనులు చేస్తున్నట్టు గుర్తించమని, పట్టుకున్నవారిని జైలుకు తరలిస్తామని చెప్పుకోచారు.అక్కడ వారి స్పొంసర్లను పిలిచి తగిన చర్యలు తీసుకుంటామని, వారి దగ్గర ప్రవాసులు ప్రయాణ ఖర్చులు వసూలు చేస్తామని తెలిపారు.

ఆ తరువాతి ప్రవసులని వారి వారి దేశాలకు పంపిస్తామని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube