వీడియో : ఒరేయ్‌ నీ సంబరం సంతకు వెళ్లా... కొన్ని రోజులు ఆగు నీకు చుక్కలు కనిపిస్తాయి  

This Guy In Too Much Happiness With His Wife In His Marriage-

పెళ్లి తర్వాత ఈమద్య కాలంలో భరత్‌ చాలా కామన్‌ అయ్యింది.భరత్‌ లేని పెళ్లిని జనాలు పట్టించుకోవడం లేదు.ముఖ్యంగా యూత్‌ ఏదైనా పెళ్లికి వెళ్లాలి అంటే భరత్‌ ఉందా అంటున్నారు.తాగి ఊగొచ్చు అనేది వారి ఉద్దేశ్యం.భరత్‌ లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సరదాగా రెండు స్టెప్పులు వేయడం మనం చూస్తూ ఉంటాం.ఆ రెండు స్టెప్పులు కూడా చాలా బలవంతం చేస్తే కాని వేయరు.

This Guy In Too Much Happiness With His Wife In His Marriage--This Guy In Too Much Happiness With His Wife Marriage-

This Guy In Too Much Happiness With His Wife In His Marriage--This Guy In Too Much Happiness With His Wife Marriage-

కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి నలుగురిలో భర్త చేయి పట్టుకునేందుకే మొహమాట పడుతుంది.అలాంటిది అతడితో డాన్స్‌ వేసేందుకు ముందుకు వస్తుందా.కాని కొందరు అమ్మాయిలు మాత్రం మొహమాటం లేకుండా డాన్స్‌లు వేసేందుకు ముందుకు వస్తారు.

ఇక అబ్బాయిలు కాస్త ఇబ్బంది అయినా కూడా స్నేహితుల కోసం డాన్స్‌ వేస్తారు.కాని వీడు ఎవడో కాని పెళ్లి అయ్యిందని ఆగడం లేదు.పెళ్లి కూతురుతో డాన్స్‌ వేయడమే ఎక్కువ అంటే వీడు ఏకంగా తాగినోడు డాన్స్‌ చేసినట్లుగా పెళ్లి కూతురును ఎత్తుకుని మరీ డాన్స్‌ చేశాడు.

ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందో కాని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.పెళ్లి కూతురును ఇలా ఎత్తుకుని పిచ్చి పిచ్చిగా డాన్స్‌ వేయడం ఏంట్రా పిచ్చి వేదవ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.పెళ్లి కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నట్లున్నాడు, మనోడు ఆగడం లేదుగా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఈ కొత్త పెళ్లి కొడుకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు.పెళ్లి కొడుకు, పెళ్లికూతురుని ఎత్తుకుని డాన్స్‌ వేయడం ఎక్కడ చూసి ఉండం.పెళ్లి, పెళ్లాం అంటే మనోడు చాలా మోజు పడుతున్నట్లుగా ఉన్నాడు.పెళ్లి అయ్యి ఒక మూడు నెలలు అయితే కాని అప్పుడు మనోడికి అసలు మ్యాటర్‌ తెలుస్తోంది.

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి

బాబోయ్‌ ఏం పెళ్లిరా అనుకుంటాడు.ఈ బాధలు ఎంట్రా, బ్యాచులర్‌గా ఎంత ఎంజాయ్‌ చేశానురా అంటూ స్నేహితులతో చెప్పుకుంటాడు.

మరి ఆ రోజు అమ్మాయికి ఎత్తుకుని మరీ డాన్స్‌ వేశావుకదా అంటూ ఎవడో ఒకడు ప్రశ్నించడం, ఆ సమయంలో ఈ పెళ్లి కొడుకు సిగ్గుతో తల గోక్కోవడం ఖచ్చితంగా జరుగుతుందని సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.