కరోనా కారణంగ సినిమాల షూటింగ్ లు, విడుదల అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి.థియేటర్ లకు అనుమతులు లభించిన వెంటనే పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం దర్శక నిర్మాతలు ఒక్కోటిగా బయటకు తీస్తున్నారు.
ఒక్కో సినిమా ఒక్కో వీకెండ్ విడుదల అవ్వుతు వచ్చింది.ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలో వీకెండ్ నుండి సినిమాలు విడుదల అవ్వుతు వస్తున్నాయి.
గడిచిన వారం మొదట్లో సంక్రాంతిని బేస్ చేసుకొని రవి తేజ క్రాక్, రామ్ రెడ్ , సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, విజయ్ మాస్టర్ సినిమాలు విడుదల అయ్యాయి.చాలా రోజులుగా థియేటర్ లో సినిమాలు లేకపోయేసరికి జనాలు ఎగబడి మరి సినిమాలు చూశారు.
ఈ మధ్య విడుదలైన సినిమాలు అన్నింటికి బాగానే కలెక్షన్స్ వచ్చాయి.50 పర్సెంట్ సిటింగ్ ఆక్యుపెన్సీ తో కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఫ్రైడే రోజున సినిమాలు మాత్రం ఒక్కటి కూడా విడుదల కావడంలేదు.ఇప్పుడిప్పుడే థియేటర్ కు అలవాటు పడుతున్న ప్రేక్షకులకు ఈ వారం నిరాశే మిగిలేలగా ఉంది.
విడుదలకు చాలా చిత్రాలు ఉన్న సరైన టైంకు విడుదల కావు.ఆల్రెడీ సంక్రాంతికి విడుదలైన చిత్రాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రేక్షకులు కొత్త సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.కానీ వచ్చే శుక్రవారం మాత్రం సినిమాలు ఏవి విడుదల అవ్వడంలేదు.

కరోనా టైంలో సినిమాలు చూద్దాం అంటే అప్పుడు థియేటర్లు బంద్ ఉన్నాయి.ఇప్పుడు థియేటర్ కు వచ్చి చూద్దాం అంటే కొత్త సినిమాలు విడుదల విషయంలో నిర్మాతలు జాప్యం చేస్తున్నారు అంటూ ప్రేక్షకులు గొణుకుంటున్నారు.ఇంకా సినిమాల రిలీజ్ విషయంపై టాలీవుడ్ నిర్మాతలు భయపడుతూనే ఉన్నారు. జనవరి 23 న అంటే నెక్స్ట్ వీకెండ్ కు అల్లరి నరేశ్ నటించిన “బంగారు బుల్లోడు” చిత్రం విడుదల అవ్వుతుంది.
ఈ చిత్రం విజయం సాదిస్తుందనే నమ్మకంతో అల్లరి నరేశ్ లేడు.ఆయన దృష్టి మొత్తం “నాంది” సినిమాపైనే ఉన్నది.
జనవరి 29 న మాత్రం యాంకర్ ప్రదీప్ నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” విడుదల అవ్వుతుంది.ఈ రెండు చిత్రాలు వారం గ్యాప్ లో వస్తున్నాయి.
కానీ మాస్ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాల దరిదాపులోకి కూడా రాకపోవచ్చు అల్లరి నరేశ్ ది కామిడీ ఎంటర్టైనర్ అయితే ప్రదీప్ మాత్రం రొమాంటిక్ లవ్ మూవీ… ఫిబ్రవరి 5న పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం విడుదల అవ్వుతుంది.కావున అన్నీ రకాల ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది.
అన్నీ రకాల ప్రేక్షకులు థియేటర్ ముందు సందడి చేసే అవకాశం ఉంది.