30 వేల పెట్టుబడితో రెండు నెలల్లో లక్ష రూపాయల లాభం.. యువ రైతులకు ఇతడు ఆదర్శం  

  • మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కూలీల రేట్లు భారీగా పెరగడం, పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతున్న నేపథ్యంలో పంట పండించినా కూడా లాభాలు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. అత్యంత దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలి. పంటలతో పాటు, పాడిని కూడా పెంచాలనేది నిపుణులు చెబుతున్నారు.

  • This Former Puts 30k For Investment And Gains 1 Lac-How Grow Your Business Tips Get More Money Viral In Social Media

    This Former Puts 30k For Investment And Gains 1 Lac

  • రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయం చేసినప్పుడే రైతులు లాభాలు దక్కించుకుంటారని చెబుతున్న మాటను వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన మునావత్‌ మహేందర్‌ తన ఇంటి ఆవరణలో ఒక షెడ్‌ ఏర్పాటు చేసి 400 నాటు కోడి పిల్లలను పెంచాడు. ఆ పిల్లలను ఒక్కో పిల్లకు దాదాపు 40 రూపాయల చొప్పున 15 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది.

  • షెడ్డు ఏర్పాటు మరియు దాన ఖర్చు మొత్తం కలిపి మరో 10 వేల రూపాయలు వస్తుందని మునావత్‌ మహేందర్‌ అన్నాడు. రెండు నెలల్లోనే 400 కోళ్లలో కనీసం 275 కోట్లు అమ్మకానికి సిద్దం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాటు కోడి కిలో ధర 175 నుండి 200 రూపాయల వరకు ఉంది.

  • This Former Puts 30k For Investment And Gains 1 Lac-How Grow Your Business Tips Get More Money Viral In Social Media
  • ఇక ఒక్కో కోడి రెండు కేజీలకు కాస్త అటుఇటుగానే పెరగడం ఖాయంగా తెలుస్తోంది. అలా మొత్తంగా ఖర్చులు అన్ని పోయి మహేందర్‌కు లక్ష రూపాయల వరకు లాభం వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖర్చులు పోయి రెండు నెలల్లో అంటే ఒక బ్యాచ్‌ పేరు మీద 50 వేలు వచ్చినా కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.

  • ఈ కోళ్ల వ్యాపారం చాలా బాగుండటంతో చాలా మంది ప్రస్తుతం నాటు కోళ్ల వ్యాపారం చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మరి ఈ నాటు కోళ్ల వ్యాపారం మీకు ఆసక్తి ఉంటే యూట్యూబ్‌లో తెలుగు రాష్ట్రాల్లో నాటు కోడి పిల్లలను సరఫరా చేసే వారి నెంబర్లు దొరుకుతాయి. వాటిని చూసి మంచి లాభాలను దక్కించుకోండి.