నేటి కాలంలో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ దర్శనమిస్తోంది.కాస్త తక్కువ ధరలకే ఫ్రిజ్‌లు అందుబాటులోకి రావడంతో.
అందరి ఇళ్లల్లోనూ ఇవి కామన్‌గా కనిపిస్తున్నాయి.అయితే ఫ్రిజ్‌లో ఏది పెట్టచ్చు.
ఏది పెట్టకూడదు.అన్న అవగాహనే చాలా మందికి ఉండటం లేదు.
ఏది పడితే అది ఫ్రిజ్‌లో తోసేస్తుంటారు.కానీ, కొన్ని కొన్ని ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
మరి ఆ పెట్టకూడని ఆహారాలు ఏంటీ అన్నది ఇప్పుడు లేట్ చేయకుండా తెలుసుకుందాం.
కాఫీ పౌడర్.
చాలా మంది ఉన్న అలవాటు కాఫీ పౌడర్ ప్యాకెట్‌ను సగం వాడి ఫ్రిజ్‌లో పెడుతుంటారు.ఇలా చేస్తే.
కాఫీ పొడి త్వరగా పాడవకుండా ఉంటుందని అనుకుంటారు.కానీ, ఇలా చేయడం వలన కాఫీ పౌడర్‌లో ఉండే హైగ్రోస్కోపిక్ నేచర్.
తేమను ఏక్కువగా పీల్చుకుంటుంది.ఫలితంగా, కాఫీ ఫ్లేవర్ మారిపోవడంతో పాటు.
అందులో ఉండే పలు పోషకాలు కూడా నాశనం అయిపోతాయి.దీని వల్ల ఈ కాఫీ పొడిని తీసుకున్నా.
ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు.
అలాగే ఎక్కువ శాతం మంది టమాటాలు త్వరగా పండకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటారు.అయితే ఇలా చేయడం వల్ల టమాటాల్లో పుష్కలంగా ఉంటే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి.అదే సమయంలో రుచి కూడా తగ్గుతుంది.
కాబట్టి, టమాటాలను ఎప్పుడూ కూడా ఫ్రిజ్‌లో పెట్టకండి.నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలు అంటే పుచ్చ కాయ, కీరదోస, బంగాళదుంప వంటివి ఫ్రిజ్‌లో పెట్టరాదు.
ఎందుకూ అంటే.వాటరీగా ఉన్న ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పాడైపోవడం లేదా.
వాటిలో నీటి శాతం తగ్గిపోవడం జరుగుతుంది.
అదేవిధంగా, చాలా మంది బ్రెడ్ చెడిపోతుందని ఫ్రిజ్‌లో పెడతారు.కానీ, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల బ్రెడ్ త్వరగా చెడిపోవడం లేదా డ్రైగా మారిపోవడం జరుగుతుంది.ఇక యాపిల్, అరటి, బెర్రీలు, నారింజ, జాయ వంటి పండ్లను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడతు.
ఇలా చేస్తే.ఆ పండ్లో ఉండే పోషకాలతో పాటు రుచి కూడా దగ్గిపోతుంది.