వామ్మో.. ఈ చేప ఖరీదు అన్ని కోట్లా..?!

సాధారణంగా ఈ రోజుల్లో చేపలు కొనాలంటే రూ.500 నుంచి రూ.1000లోపు ఇస్తే సరిపోతుంది.కానీ ఒక చేప కొనాలంటే మాత్రం ఏకంగా రూ.2 నుంచి 3 కోట్లు చెల్లించాలి.ఇది షాకింగ్ గా అనిపించినా అక్షరాలా నిజం.

 This Fish Costs All Crores, Costly Fish, Latest News, Dragonfish , Asia-TeluguStop.com

అంత ధర పలికే ఆ చేపని డ్రాగన్ ఫిష్ లేదా ఏషియన్ అరోవానా అని పిలుస్తారు.ఈ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇంతకీ ఈ చేప ఎక్కడ దొరుకుతుంది? దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చైనా దేశంలో డ్రాగన్ ఫిష్ దొరుకుతోంది.

దీన్ని సొంతం చేసుకునేందుకు ప్రజలు క్యూ కడుతుంటారు.ఎందుకంటే దీన్ని దక్కించుకున్న ప్రజలకు అదృష్టం వరిస్తుందని భావిస్తుంటారు.

అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు.అలా దీని డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఇప్పుడు దాని ధర మూడు కోట్లకు చేరుకుంది.

ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం కురుస్తుందట.ఎరుపు రంగులో ఉండే ఈ చేపలను అత్యంత విలువైన ఒక డైమండ్ తో పోలుస్తారు.

అలాగే ఒక వజ్రానికి ఇచ్చిన సెక్యూరిటీ దీనికి ఇస్తారు.ప్రజలు దీనిని ఆక్వేరియంలో ఉచితంగా చూడొచ్చు.

అయితే దాన్ని పట్టుకోవడానికి, దగ్గరికి వెళ్లడానికి మాత్రం అనుమతి లేదు.ఈ చేపకు ఎల్లవేళలా ప్రొటెక్షన్ ఇచ్చేందుకు చాలా మంది సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తూ ఉంటారు.

19వ, 20వ శతాబ్దాలలో ఈ డ్రాగన్ ఫిష్ ను కొల్లగొట్టేందుకు ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారట.ఆ సమయం నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంది.అయితే 2009లో ఓ వ్యక్తి ఈ చేపను రూ.2 కోట్ల 20 లక్షలకు విక్రయించాడు.విస్తుపోయే అంశం ఏంటంటే.చైనా మినహా ఆసియాలోని అనేక దేశాల్లో ఈ చేపలను విక్రయించటం నేరం.అమెరికాలో మాత్రం ఈ చేపను బ్లాక్ మార్కెట్ లో కొనచ్చు.విక్రేతలు పట్టుబడితే మాత్రం వారికి జైలు శిక్ష తప్పదు.

ఇలా ఈ చేప ప్రజలందరిలో ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube