ఆదర్శం : ప్రపంచంలోనే అతి చీప్‌ వాటర్‌ ఫిల్టర్‌ తయారు చేసింది మనోడే

మారుతున్న జనజీవనం మరియు పెరిగిన కాలుష్యం కారణంగా కనీసం మంచి నీరు కూడా సరైనది దొరికే పరిస్థితి లేదు.అత్యంత దుర్బర జీవన విధానం గడుపుతున్న సగటు పేదవాడు మంచి నీరు లేక పోవడంతో అత్యంత సాదారణ, మలినాలు ఉన్న నీటిని తాగాల్సిన పరిస్థితి వస్తుంది.

 This Engineering Student Has Made A Portable Water Purifier-TeluguStop.com

ఇంట్లో ఉన్నప్పుడు ఫిల్టర్‌ నీళ్లు లేదంటే మంచి నీరు తాగవచ్చు.కాని బయటకు వెళ్లిన సమయంలో మనం తాగే నీరు ఎలాంటిదో అనే భయం అందరిలోనూ ఉంటుంది.

ఆ నీటిని ఫిల్టర్‌ చేశారో లేదో, అసలు ఆ నీరు ఎలా ఫిల్టర్‌ చేశారో అనే భయం అందరిలోనూ ఉంటుంది.

వాటర్‌ ఫిట్లర్‌ జేబులో పెట్టుకుని తిరిగితే బాగుంటుంది కదా అని నిరంజన్‌ కరగి ఆలోచించాడు.

నీటి ఫిల్టర్‌ జేబులో పెట్టుకుని తిరిగేలా తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు.వేల రూపాయల కాస్ట్‌ ఉండే నీటి ఫిల్లర్‌ జోబులో పెట్టుకుని తిరగడం ఎలా అంటూ చాలా మంది అతడిని గేలి చేశారు.

కాని అతడు మాత్రం నిరుత్సాహ పడకుండా తాను అనుకున్న దాని కోసం పరిశోదనలు చేయడం మొదలు పెట్టాడు.గూగుల్‌లో నీటిని శుద్ది చేసే విధానంను చూశాడు.ఆ విధానం చిన్న పరికరంలో ఎందుకు చేయరాదు అంటూ ఆలోచించాడు.అలా ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫిల్టర్‌ను కనిపెట్టాడు.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, బెలగావికి చెందిన 22 యేళ్ళ నిరంజన్‌ ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కింది.అద్బుతమైన ప్రయోజనాలున్న మినీ వాటర్‌ ఫిల్టర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.ఈ వాటపర్‌ ఫిల్లర్‌ను బాటిల్‌లో నీరు పోసి దానికి పెట్టాలి.డైరెక్ట్‌గా తాగేయవచ్చు.ఎంతటి మలినాలు ఉన్న నీటిని అయినా ఈ చిన్న పరికరం క్లీన్‌ చేస్తుంది.ప్రముఖులు, శాస్త్రవేత్తలు సైతం నోరు వెళ్లబెట్టేలా చేసిన ఈ పరికరం ఎన్నో అవార్డులను మరియు రికార్డులను అందుకుంది.

ఈయన తయారు చేసిన పరికరానికి విదేశాల్లో కూడా డిమాండ్‌ ఉంది.

ఇంత మంది ఆధరిస్తున్న ఈ పరికరం ఎంతో తెలుసా కేవలం 20 రూపాయలు.పన్నులు ఇతరత్ర కలిపి 30 రూపాయలకే ఈ పరికరాన్ని మార్కెట్‌లో ఉంచాడు.ఏమాత్రం పబ్లిసిటీ లేకుండానే 8 మంది ఈ పరికరంపై ఆసక్తి చూపి కొనుగోలు చేశారు.

ఇప్పుడు విదేశాల నుండి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయి.ట్రేడ్‌ మార్క్‌ తీసుకున్న నిరంజన్‌ ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం వీటిని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒక చిన్న ఆలోచన అతడికి లక్షలు కురిపిస్తుంది.అద్బుతమైన ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలనే పట్టుదలతో ఉన్న నిరంజన్‌ను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube