ఈ కుక్క దర్జానే వేరు... ప్రయాణికులు లేచి మరి మెట్రో రైలులో సీట్ ఇస్తారు తెలుసా..?!

This Dog Status Passengers Will Give Seat To This Dog In Metro Trains

కుక్కలను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.కానీ రోడ్డుమీద తిరిగే కుక్కలను చూస్తే మాత్రం ఎవరన్నా కానీ బయపడిపోతూ ఉంటారు.

 This Dog Status Passengers Will Give Seat To This Dog In Metro Trains-TeluguStop.com

ఎందుకంటే అవి ఎక్కడ కరుస్తాయో అని ఒకపక్క, కరిచాక బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ చేపించుకోవాలనే భయం మరో పక్కా ఉంటుంది కాబట్టి.కానీ ఈ కుక్కను చూసి ఎవరు కూడా భయపడరు.

కుక్క ఒక్కరోజు కనిపించకపోయినా సరే దాని కోసం ఆరా తీయడం మొదలుపెడతారు.ఇంకా చెప్పాలంటే ఈ కుక్క దర్జానే వేరు.

 This Dog Status Passengers Will Give Seat To This Dog In Metro Trains-ఈ కుక్క దర్జానే వేరు… ప్రయాణికులు లేచి మరి మెట్రో రైలులో సీట్ ఇస్తారు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిని చూసి మెట్రో రైలులో కూర్చున్న ప్రయాణికులు సైతం లేచి నిలబడి ఈ కుక్కకి సీట్ ఇస్తారు తెలుసా.అసలు కుక్క మెట్రో రైలు ఎందుకు ఎక్కింది.? దానికి అక్కడ ప్రయాణికులు లేచి నిలబడి మరి సీట్ ఎందుకు ఇస్తున్నారు అనే అయోమయంలో ఉన్నారా.? అయితే ఒకసారి ఆ శునకరాజు కథ ఏంటో తెలుసుకోండి.

కుక్క ఒక్క మెట్రో రైలు మాత్రమే ఎక్కదండోయ్.బస్సు, మెట్రో ట్రైను ఇలా ఏది పడితే అది ఎక్కేస్తుంది.ఎక్కడికంటే అక్కడికి తిరిగేస్తుంటుంది.కానీ ఆ కుక్కని ఎవరు ఏమి అనరు.

ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ కుక్క అలాగే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలన్ని తిరుగుతూ ఉంటుంది కాబట్టి.ఇంతకీ ఈ కుక్క ఏ ప్రాంతానికి చెందింది అంటే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ కి చెందిన కుక్క.

ఏ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనంలో అయిన దర్జాగా ఎక్కేసి కూర్చుంటుంది.ఆ వాహనాల్లో తిరిగే ప్రయాణికులందరికీ ఈ కుక్క గురించి తెలుసు.

కుక్క ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఇలా మెట్రో రైళ్లలో తిరుగుతునే ఉంటుంది.ఈ కుక్కకి ఒక పేరు కూడా ఉందండోయ్.

ఈ శునకరాజు పేరు ‘బోజీ’. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్‌ ట్రెయిన్‌ ఎక్కి తిరగడం దీని దినచర్య.

Telugu Boji, Historical, Isthambul, Metro Train, Metro Travel, Respect Dog, Strary Dog, Turkey Dog, Latest-Latest News - Telugu

అసలు ఈ కుక్క ఎక్కడికి ఇలా ప్రతి రోజు వెళ్తుందో తెలుసుకోవాలని అధికారులు దాని చెవికి ఒక ట్రాక్‌ చిప్‌ అమర్చారు.బోజీ ప్రతి రోజు ఇస్తాంబుల్‌ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి వెళ్తున్నట్లు అధికారులు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.కాగా ఈ బోజీకి మెట్రో ట్రైన్ లో ప్రయాణించటమంటే బోలెడంత ఇష్టం.ఎక్కువగా మెట్రో ట్రైన్ లోనే తిరుగుతుంది.ఇలా ఇస్తాంబుల్‌ జనాలకు గత 10ఏళ్లుగా ఈ బోజీ అలవాటైపోయింది.దీనితో మెట్రో ఎక్కగానే ప్రతి ఒక్కరు కూడా బోజీ ఉందో లేదో అని వెతుకులాట ప్రారంభిస్తారు.

అలాగే భోజీని ఎవరు కూడా ఏమి అనరు.ఎంచక్కా వచ్చి సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తుంది.

ఒకవేళ సీట్ కాళిగా లేకపోతే భోజి నుంచోడం చూసి సీట్లో కూర్చున్నవారు కూడా లేచి దానికి సీట్ ఇస్తారు.అదికూడా మహారాజుల ఫీల్ అయిపొయ దర్జాగా సీట్లో కూర్చుంటుంది.ఇదండీ ఈ శునకరాజు కధ.వినటానికి వింతగా ఉన్నా కొత్తగా ఉంది కదా.

#Isthambul #Metro Train #Historical #Turkey Dog #Boji

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube