ఆహా.. బ‌తుకంటే ఈ కుక్క‌దే.. వీడియో వైర‌ల్‌

This Dog Is Better Than Life

చాలామంది తిట్టేందుకు ఓ ప‌దాన్ని ఎక్కువ‌గా వాడుతుంటారు.ఇంకొంద‌రు తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు కూడా త‌మ బ‌తుకును కుక్క‌తో పోల్చుకుంటారు.

 This Dog Is Better Than Life-TeluguStop.com

ఇదేం బ‌తుకురా కుక్క బ‌తుకు అన్న‌ట్టు తిట్ట‌డానికి అయినా బాధ ప‌డ‌టానికి అయినా స‌రే దీన్నే ఎక్కువ‌గా వాడుతుంటారు.మ‌రి నిజంగా కుక్క‌లు అంత దారుణ‌మైన బ‌తుకు బ‌తుకుతున్నాయా అంటే ఇవాళ రేపు పెంపుడు కుక్క‌ల‌ను చూస్తే ఈ ప‌దం త‌ప్పేమో అనిపిస్తుంది.

ప‌ట్ట‌ణాల్లో, ప‌ల్లెటూర్ల‌లో ఈ మ‌ధ్య కుక్క‌ల‌ను పెంచుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది.

 This Dog Is Better Than Life-ఆహా.. బ‌తుకంటే ఈ కుక్క‌దే.. వీడియో వైర‌ల్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డ‌బ్బున్న వాళ్ల ఇంట్లో అయితే కుక్క‌ల‌ను సొంత ఇంటి మ‌నుషుల్లాగే చూసుకుంటారు.

స‌క‌ల సౌక‌ర్యాల న‌డుమ ఖ‌రీదైన తిండిని తింటూ ఎంజాయ్ చేస్తుంటాయి కుక్క‌లు.అయితే ఇప్పుడు మేం చూపించ‌బోయే కుక్క ను చూస్తే ఆహా బ‌తుకంటే దీనిదే అని అనుకుంటారు కాబోలు.

ఎందుకంటే దానికే స్పెష‌ల్ గా ఓ ఇల్లు కూడా ఉంది.దాని ఇల్లును చూస్తే ఎవ్వ‌రైనా షాక్ అయిపోతారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా ఇది ఎంత అదృష్ట‌వంతురాలో అని ఫీల్ అవుతున్నారు.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ ఇంటి వాళ్లు తాము పెంచుకుంటున్న కుక్క కోసం ఓ ఇంటినే స్పెష‌ల్ గా నిర్మించారు.ఇక ఈ అంద‌మైన ఇంటిని రెండు అంత‌స్తులుగా నిర్మించారు.ఇందులో అన్ని హై క్లాస్ వ‌స్తువుల‌ను ఉంచారు.టీవీ, బెడ్‌, ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయండోయ్‌.చూసేందుకు చిన్న పాటి ఇంద్ర భ‌వ‌నం లాగే అందంగా, నీట్ గా  ఉంది. ద‌ర్జాగా ఆ కుక్క ఇందులో బ‌తికేస్తుంది.

దాని కోసం స్పెష‌ల్ గా ఫుడ్ ను కూడా ప్రిపేర్ చేస్తుంటారంట‌.ఇదంతా విన‌డానికి ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నా కూడా ఇదే నిజ‌మండి బాబు.

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

#Pet Dog

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube