ఇదో వింత స్మగ్లింగ్‌ కేసు.. అండర్‌ వేర్‌ లో పిల్లి పిల్లలను దాచాడు, అడ్డంగా దొరికి పోయాడు, పిల్లుల స్మగ్లింగ్‌ ఎందుకంటే?  

This Different Smuggling: A Man Smuggles Cats In His Pants-cats Smuggling,different Smuggling,viral In Social Media,viral News Social Media

There is a high level of permits for a small country from one country to another. For instance, a country's gold is taken to another country, which means asking a variety of questions.

.

We're seeing this news in gold especially. Gold from one country to another is smuggling more and more. Smuggling items like gold and gold are also made. But one man strangely tried to smuggle cats and booked horizontally. .

They say that he has been charged with smuggling a child and can impose a penalty of at least ten thousand dollars in jail along with two years' jail sentence. If we are at home, we are still in front of the cat's children. This incident has proven once again that there is no country in our country. .

ఒక దేశం నుండి మరో దేశానికి చిన్న వస్తువు తీసుకు వెళ్లాలన్నా కూడా ఉన్నత స్థాయిలో అనుమతులు ఉండాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక దేశంకు చెందిన బంగారంను మరో దేశంకు తీసుకు వెళ్లాలి అంటే మాత్రం చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు..

ఇదో వింత స్మగ్లింగ్‌ కేసు.. అండర్‌ వేర్‌ లో పిల్లి పిల్లలను దాచాడు, అడ్డంగా దొరికి పోయాడు, పిల్లుల స్మగ్లింగ్‌ ఎందుకంటే?-This Different Smuggling: A Man Smuggles Cats In His Pants

ముఖ్యంగా బంగారం విషయంలో ఈ వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఒక దేశం నుండి బంగారంను మరో దేశానికి ఎక్కువగా స్మగ్లింగ్‌ చేస్తూ ఉంటారు.

బంగారంతో పాటు బంగారంలాంటి వస్తువులను కూడా స్మగ్లింగ్‌ చేస్తారు. కాని అక్కడొకడు మాత్రం విచిత్రంగా పిల్లులను స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్‌ అయ్యాడు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మలేషియా మరియు సింగపూర్‌లో రోడ్డు మార్గపు సరిహద్దులను కలిగి ఉన్నాయి. ఆ సరిహద్దు నుండి రోజుకు ఎంతో మంది అటు ఇటుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు.

ఎంత మంది ప్రయాణించినా కూడా భద్రతా అధికారులు మాత్రం క్షుణంగా పరిశీలించి ఏ ఒక్క వస్తువు కూడా స్మగ్లింగ్‌ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. రోజులాగే భద్రతా అధికారులు చెకింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలోనే మలేషియా నుండి సింగపూర్‌కు వెళ్తున్న ఒక వాహనంను ఆపారు..

ఆ వాహనం మొత్తం తనికీ చేశారు, ఆ వ్యక్తిని కూడా చూశారు. అంతా బాగానే ఉంది వెళ్లి పోండి అంటూ పంపించారు. ఆ సమయంలోనే పిల్లి పిల్లల సౌండ్‌ వినిపించింది.

వెళ్లి పోమన్న ఆ వ్యక్తిని ఆగమన్నారు. అతడు కంగారు పడ్డాడు. వెళ్తానంటూ అడుగులు ముందుకు వేశాడు.

పోలీసులు వెంటనే మీ ప్యాంట్‌ నుండి సౌండ్స్‌ వస్తున్నాయి. పాయింట్‌ విప్పండి అంటూ కోరారు.

పోలీసు వారు గట్టిగా అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు ప్యాంట్‌ విప్పాడు.

ప్యాంట్‌ విప్పగానే పోలీసులు షాక్‌ అయ్యారు. ప్యాంట్‌లో ఏకంగా నాలుగు పిల్లులను పెట్టుకున్నాడు. అతడి వాలకానికి ఒక్కసారిగా పోలీసులు షాక్‌ అయ్యారు.

సింగపూర్‌కు పిల్లులు మరియు కుక్క పిల్లల అనుమతి చాలా తక్కువ. ఒకవేళ వేరే దేశం నుండి వస్తే వాటికి అన్ని పరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తారు. రేబీస్‌తో పాటు ఇంకా ప్రమాధకర వ్యాధులు ప్రభల కుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది.

కాని అక్కడ పిల్లి పిల్లలకు మరియు కుక్క పిల్లలకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో ఇలా స్మగ్లింగ్‌ చేసుకుని వచ్చి మరీ భారీ రేటుకు ఇలాంటి వారు అమ్ముతున్నారట.

పిల్లి పిల్లల స్మగ్లింగ్‌ చేస్తూ పట్టబడ్డ ఇతడికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, కనీసం పది వేల సింగపూర్‌ డాలర్ల జరిమాన కూడా విధించే అవకాశం ఉందని అక్కడి వారు అంటున్నారు. అదే మన వద్దనైతే పిల్లి పిల్లలను వద్దన్నా కూడా ఇంటి ముందు పారేసి పోతూ ఉంటారు.

మన దేశంలో ఉన్న స్వాతంత్య్రం మరే దేశంలో లేదని ఈ సంఘటనతో మరోసారి నిరూపితం అయ్యింది.