పవన్, మహేష్ లతో నటించిన క్యూట్ బేబీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కుర్చీలో కూర్చున్న క్యూట్ బేబీ ప్రస్తుతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది.అంతేకాకుండా స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలను సొంతం చేసుకుంది ఈ క్యూట్ బేబీ.

 Keerthy Suresh Shared Her Childhood Cute Photo On Instagram On Her Sisters Birth-TeluguStop.com

ఇప్పుడు ఈ క్యూట్ బేబీ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే.ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.

ఇంకెవరు మన తెలుగు ముద్దు గుమ్మ కీర్తి సురేష్.

అవును అందులో ఉన్న బేబీ.కీర్తి సురేషే.అస్సలు పోలిక లేదు కదా.కీర్తి సురేష్ మార్చి 10న తన అక్క పుట్టినరోజు సందర్భంగా కొన్ని చైల్డ్ హుడ్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.కీర్తి సురేష్ అక్క రేవతి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ప్రముఖ హీరోయిన్ మేనక, నిర్మాత మరియు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కుమార్ ల ఇద్దరమ్మాయిలు వీళ్లే.ఇక ఆ ఫోటోలో కీర్తి సురేష్ ఎంత క్యూట్ గా కనిపిస్తూ బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత మంచి గుర్తింపు సొంతం చేసుకోగా వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా మారింది.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాల్లో కూడా నటిస్తుంది.ఇక పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనున్న మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమాలో కూడా నటిస్తుంది.

ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి, నితిన్ సరసన రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ నటించగా ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube