ముడ‌త‌ల‌కు దూరంగా ఉండాలా? అయితే మీరీ క్రీమ్ వాడాల్సిందే!

ముడ‌త‌లు. ఎంద‌రినో వేధించే కామ‌న్ స‌మ‌స్య.

 This Cream Can Be Used To Avoid From Wrinkles Details! Natural Cream, Avoid Wrin-TeluguStop.com

అందులోనూ ఇటీవ‌ల రోజుల్లో పాతికేళ్లు దాటాయంటే చాలు ముడ‌త‌లు ప్రారంభ‌మై.సౌంద‌ర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి.

ఆహార‌పు అల‌వాటు, హార్మోన్ ఛేంజ‌స్‌, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌లు ఏర్ప‌డుతుంది.దాంతో వాటిని నివారించుకునేందుకు ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌క‌పోతే ఏవేవో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే బెస్ట్ అండ్ న్యాచుర‌ల్ క్రీమ్‌ను వాడితే గ‌నుక ముడ‌త‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

అదే స‌మ‌యంలో ఉన్న ముడ‌త‌ల‌నూ పోగొట్టుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ న్యాచుర‌ల్ క్రీమ్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? ఏ విధంగా యూజ్ చేయాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్లు బీస్‌వ్యాక్స్‌, మూడు స్పూన్లు ఆలివ్ ఆయిల్‌, ఒక‌టిన్న‌ర స్పూన్ కొకొన‌ట్ ఆయిల్ వేసుకుని డ‌బుల్ బాయిల‌ర్ ప‌ద్ధ‌తిలో క్రీమీగా అయ్యే వ‌ర‌కు హీట్ చేసుకోవాలి.

Telugu Avoid Wrinkles, Tips, Bees Wax, Coconut Oil, Creams, Face, Latest, Natura

ఆపై ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార బెట్టుకుని.అప్పుడు అందులో ఐదు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, ప‌ది చుక్క‌లు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్‌ను సిద్ధ‌మైన‌ట్టే.

ఈ క్రీమ్‌ను గాలి చొర‌బ‌డ‌ని డ‌బ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దాదాపు ఇర‌వై రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది.ఇక ఈ క్రీమ్‌ను ఎలా వాడాలీ అంటే.

రాత్రి నిద్ర‌పోయే ముందు వాట‌ర్‌తు ఫేస్‌ను, నెక్‌ను శుభ్రం చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్న క్రీమ్‌ను అప్లై చేసుకుని నిద్రించాలి.

ఇలా చేస్తే ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.మ‌రియు ముడ‌త‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌ట్టి చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube