అరెరే: ఈ క్రేజీ చేప నీల్లలోనే కాదు.. బయటకూడా..?!

ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలుసు.

 This Crazy Hawaii Fish Can Climb Cliffs Also-TeluguStop.com

కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మనలో చాలామందికి తెలియదు.మన చుట్టూ ఉండే కొన్ని జీవుల గురించి మాత్రమే మనకు తెలుసు.

కానీ మనకి తెలియని జీవులు కూడా ఎన్నో ఉన్నాయి.అలాంటి ఒక వింత జలచరం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.

 This Crazy Hawaii Fish Can Climb Cliffs Also-అరెరే: ఈ క్రేజీ చేప నీల్లలోనే కాదు.. బయటకూడా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన అందరికి చేపల గురించి బాగా తెలుసు.ఎందుకంటే చేపలను మనం కూర వండుకుని లొట్టలేసుకుంటూ తింటూ చేప రుచుకి ఫిదా అయిపోతాము కదా.అయితే మనకు తెలిసిన చేపలు జలచరాలు అంటే నీటిలో మాత్రమే నివసిస్తాయి.బయట ప్రపంచంలో బతకలేవు.

నీటిలో ఉంటేనే వాటికి మనుగడ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే కదా.

కానీ ఇప్పుడు చెప్పబోయే చేపలు మాత్రం నీటిలోనే కాకుండా బయట కూడా బతుకుతాయి.అలాగే కొండలు కూడా ఎక్కుతాయట.మరి ఆ చేపల వివరాలు ఒకసారి చూద్దామా.ఈ చేపలు హవాయి దీవుల్లో కనిపిస్తాయి.వీటిని ఓప్ చేపలు అని అంటారు.

ఈ చేపల స్పెషాలిటీ ఏంటంటే ఇవి జలపాతాలలోని రాళ్లపై పాకుతాయట.అలాగే సుమారు 300 మీటర్ల వరకు ప్రయాణించి కొండ ఎగువకు కూడా వెళతాయి.

Telugu Climb Cliffs, Crazy Fish, Crazy Hawaii Fish, Hawaii Islands, Op Fish, Social Media, Survive In Water And Land, Variety Fishes, Viral Fishes, Viral Latest, Viral News-Latest News - Telugu

ఓప్ చేపలకు నోరు, పొట్ట కింద రెక్కలు ఉంటాయి.ఈ చేపలకు ఉండే ఈ ప్రత్యేక అమరిక వలన అవి కొండలు సైతం అలవోకగా ఎక్కుతాయట.అంతేకాకుండా ఈ చేపలకు మరొక విశిష్టత ఉంది.అది ఏంటంటే కొండలు ఎక్కడంతో పాటు ఈ చేపలు అవసరాన్ని బట్టి రంగులు కూడా మారుస్తాయట.

సాధరణంగా ఈ చేపలు గోధుమ వర్ణంలో ఉంటాయి.అయితే ఊసరవెల్లిలాగా పరిసరాలకు అనుగుణంగా తమని తాము కాపాడుకోవడానికి రంగులు మార్చుకుంటాయట.

అలాగే., ఈ చేపలు ఒక అడుగు పొడవు వరకు పెరుగుతాయి.

Telugu Climb Cliffs, Crazy Fish, Crazy Hawaii Fish, Hawaii Islands, Op Fish, Social Media, Survive In Water And Land, Variety Fishes, Viral Fishes, Viral Latest, Viral News-Latest News - Telugu

అయితే ఆరు హవాయి దీవుల్లో ఈ రకం చేపలున్నాయట.కానీ ఎన్ని చేపలు ఉంటాయో అనే విషయంపై స్పష్టత లేదని పరిశోధకులు చెప్పారు.ఈ రకానికి చెందిన చేపలు మొత్తం 5 జాతులుగా ఉన్నాయి.వాటిలో నాలుగు జాతులకు చెందిన ఓప్ చేపలు రాళ్లపైకి పాకే ప్రత్యేక లక్షణం కలిగి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

#SurviveIn #Variety Fishes #Op Fish #Hawaii Islands #Crazy Fish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు