విడాకుల ఆహ్వాన పత్రిక... సోషల్ మీడియాలో వైరల్

పెళ్లి అనే బంధం గొప్పదే అయిన అది జరిగే విధానం చాలా మందికి నచ్చదు.పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాడు ఎలాంటి వాడో ముందు తెలుసుకోకుండా వాడిని గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవడం అంత మూర్ఖత్వం ఉండదని ఈ కాలం అమ్మాయిల నమ్మకం.

 This Comicdivorce Card Highlights Theissue Of Compatibility-TeluguStop.com

కట్టుకున్న భర్త శాడిస్ట్ అయిన, బాద్యత లేని వాడు అయిన, వ్యాసనపరుడు అయిన కలిసి బ్రతకాలని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే అలాంటి వాడితో కలిసి బ్రతికే కంటే విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని కొనసాగించడం ఉత్తమం అని ఈ జెనరేషన్ అమ్మాయిల ఆలోచన.

ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే డివోర్స్ ఇన్విటేషన్.

ఇష్టం లేని వ్యక్తికి విడాకులు ఇస్తే ఆమెకు స్వేచ్చ వచ్చినట్లే కదా.ఆ తరువాత ఆమెకు ప్రతి రోజూ పండగే కదా అలాంటి పండగని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేంటి అంటూ పాకిస్తాన్ ఆర్టిస్ట్ కోమల్ ఆష్ పెళ్లి శుభలేఖ తరహాలోనే డివోర్స్ కార్డును తయారు చేసింది.ఇందులో ఓ వివాహిత విడాకుల వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్న చిత్రం ఉంది.

దానిపై విడాకుల కార్యక్రమానికి నా సాదర ఆహ్వానం అని రాసి ఉంది.అందులో ఆమె గుండెను చేతితో పిండేస్తున్నట్లు ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ డివోర్స్ కార్డు ఇప్పుడు వైరల్ అయింది.నిజంగా డివోర్స్ కార్డ్ ఈ జెనరేషన్ లో చాలా మంది విడాకుల తీసుకుంటున్న మహిళలకి అవసరం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

స్త్రీ స్వేచ్చని చూపించడానికి ఇదొక గుర్తు అని అందరూ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube