విడాకులు తీసుకున్న అమ్మానాన్నను కలిపిన పిల్లాడు.. సినిమాను తలపించిన రియల్‌ స్టోరీ

భార్య భర్తలు విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్‌ విషయం.అయితే కొన్ని సార్లు భార్య భర్తలు విడాకులు తీసుకోవడం వల్ల వారి పిల్లలు ఇబ్బందులకు గురవ్వడం మనం చూస్తూ ఉంటాం.

 This Child Again Made Marriage Divorced Parents-TeluguStop.com

కొన్ని సార్లు పిల్లల కోసం తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ కలుస్తూ ఉంటారు.బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ పిల్లల కోసం విడాకులు ఇచ్చిన భార్యతో గడుపుతున్నాడు.

మళ్లీ ఆమెను పెళ్లి చేసుకుంటాడేమో అనే చర్చ కూడా జరుగుతుంది.ఇలాంటి సంఘటన హర్యానా రాష్ట్రంలోని జజ్జర్‌లో జరిగింది.

విడాకులు తీసుకున్న అమ్మానాన్

పూర్తి వివరాల్లోకి వెళ్తే… జజ్జర్‌లో నాలుగు సంవత్సరాల క్రితం ఒక జంట పెళ్లి చేసుకుంది.వారిద్దరు మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత గొడవలు ప్రారంభం అయ్యాయి.ఇద్దరి మద్య గొడవలు తారా స్థాయికి చేరడంతో విడాకుల వరకు వెళ్లారు.అప్పటికి వారికి పిల్లలు ఏమీ లేరు.అయితే విడాకులు తీసుకున్న 10 నెలల తర్వాత ఆమె బాబుకు జన్మనిచ్చింది.తాను విడాకులు తీసుకునే సమయంలో గర్బవతిని అని, ఆ విషయం అప్పటికి నిర్ధారణ కాలేదని, నా బాబుకు తండ్రి అతడే అంటూ ఆమె కోర్టుకు ఎక్కింది.

అయితే అతడు మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత తల్లి అయ్యింది.ఆ బాబుకు నాకు సంబంధం లేదు అంటూ వాదించడం మొదలు పెట్టాడు.

విడాకులు తీసుకున్న అమ్మానాన్

ఆమె కోరిక మేరకు బాబుకు భర్తకు డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్దం అయ్యారు.డీఎన్‌ఏ రిపోర్ట్‌ రాకుండానే భర్త మనసు మార్చుకుని కొడుకును హక్కున చేర్చుకున్నాడు.వీడు నా కొడుకే అంటూ ఎత్తుకుని ముద్దులు పెట్టాడు.ఇక తనకు ఒక మంచి కొడుకును ఇచ్చావంటూ భార్యను కూడా దగ్గరకు తీసుకున్నాడు.విడాకులు తీసుకున్న కొన్ని నెలల తర్వాత మళ్లీ వీరిద్దరు బాబు కోసం పెళ్లి చేసుకున్నారు.స్థానికంగా సంచలనం రేపిన ఈ విషయం సోషల్‌ మీడియాలో ప్రపంచం అంతా కూడా వైరల్‌ అవుతోంది.

మొత్తానికి అప్పుడే పుట్టిన కుర్రాడు తల్లిదండ్రులను కలిపేశాడు.నిజంగా వాడు గ్రేట్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube