33 ఏళ్లుగా బోజనమే చేయని మహిళ, బిస్కట్‌ కూడా తినదు.. ఆమె కేవలం దాన్ని మాత్రమే తీసుకుంటుంది

ఉదయం టిఫిన్‌ చేసి, మద్యాహ్నం బోజనం ఆలస్యం అయితేనే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది.అన్నం కాకుండా మరేం తిన్నా కూడా ఆకలి ఫీలింగ్‌ అలాగే ఉంటుంది.

 This Chhattisgarh Woman Is Surviving On Just Tea For 30 Years-TeluguStop.com

గంట రెండు గంటలు ఆలస్యం అయితేనే కడుపులో పేగులు మెలి తిప్పినట్లుగా అనిపిస్తుంది.ఇక రోజంతా అన్నం తినకుంటే బతకలేమేమో అన్న ఫీలింగ్‌ కలుగుతుంది.

అన్నం కాకుండా చిరు తిండి ఎంత తిన్నా కూడా ఆకలి మాత్రం తీరదు.ఒకటి రెండు రోజులు చిరు తిండితో ఉండవచ్చు.

కాని అన్నం లేకుండా మాత్రం ఉండటం అంత సులభమైన విషయం కాదు.కాని చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఒక మహిళ మాత్రం ఏకంగా 33 సంవత్సరాలుగా ఏమీ తినకుండానే జీవించేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చతీస్‌ఘడ్‌ రాష్ట్రం, కొరియా జిల్లాలోని బరదియా గ్రామానికి చెందిన 44 ఏళ్ల పిల్లిదేవి తనకు 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి తినడం మానేసింది.ఆమె కేవలం చాయి మాత్రమే తాగుతూ జీవితాన్ని గడిపేస్తుంది.ఆమె అప్పటి నుండి కూడా కేవలం చాయి తాగుతూ తన శరీరంను బతికించుకుంటూ వస్తుంది.అది కూడా ఆమె తాగే టీ పాలతో తయారు కావడం లేదు, కేవలం ఆమె తాగేది బ్లాక్‌ టీ.అవును మీరు చదివింది నిజమే 33 సంవత్సరాలుగా కేవలం బ్లాక్‌ టీ తాగుతూ జీవితాన్ని గడిపేస్తుంది.

దేవి గురించి ఆమె తండ్రి రతిరామ్‌ మాట్లాడుతూ.తన కూతురు ఆరవ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్‌ తరపున జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వెళ్లింది.తిరిగి వచ్చిన తర్వాత భోజనం చేయనంది.

ఆ తర్వాత రోజు చేస్తుందేమో అనుకున్నాం.ఎంత బతిమిలాడినా రోజులు, నెలలు గడిచినా ఆమె బోజనం చేయలేదు.

కేవలం టీ మాత్రం తాగుతూ వచ్చింది.అప్పట్లో కనీసం నీళ్లు కూడా తాగేది కాదు.

కేవలం టీ మరియు బిస్కట్స్‌ తినేది.కాని ఇప్పుడు నీళ్లు తాగుతుంది కాని, బిస్కట్స్‌ వదిలేసింది.

కేవలం నీరు మరియు టీతోనే తన కూతురు బతికేస్తుందని చెప్పాడు.అయితే ఎందుకు ఆమె ఇలా చేస్తుందని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇన్నాళ్లుగా ఆహారం తీసుకోకుండా ఉన్నా కూడా ఆమెకు ఎలాంటి చిన్న జబ్బు కూడా లేదని వైధ్యులు నిర్థారించారు.ఇన్నాళ్లుగా ఆమె తినకుండా ఎలా ఉందో అర్థం కావడం లేదంటూ డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అసలు ప్రపంచంలో ఇలాంటి మనిషి ఉండరేమో అంటున్నారు.ఈమె కేవలం చాయి తాగుతూ బతికేస్తుంది కనుక ఈమెను స్థానికులు అంతా కూడా చాయ్‌ వాలీ చాచీ అంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube