ఈ బాడీ బిల్డ‌ర్ చూడ‌టానికి యువ‌కుడిలా ఉన్నాడు.. కానీ అస‌లు వ‌య‌సు తెలిస్తే

This Bodybuilder Looks Like A Teenager But If You Know The Real Age

హెల్త్ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.ఎవ‌రికీ కూడా వృద్ధాప్యం అంటే అస్స‌లు న‌చ్చ‌దు.

 This Bodybuilder Looks Like A Teenager But If You Know The Real Age-TeluguStop.com

చాలా మంది వ‌య‌సు పెరుగుతున్నా స‌రే య‌వ్వ‌నంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు.ఇందులో ముఖ్యంగా సెల‌బ్రిటీలు, ఇత‌ర డిపార్టుమెంట్లకు చెందిన వారు కూడా ఉంటారు.

అయితే బాడీ బిల్డ‌ర్లు కూడా వారి వ‌య‌సు మీద ప‌డుతున్నా స‌రే అస్స‌లు ఏర్ప‌డ‌రు.ఎందుకంటే వారు నిత్యం వ్యాయామాలు చేయ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డం లాంటివి చేస్తారు కాబ‌ట్టి వ‌య‌సు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతారు.

 This Bodybuilder Looks Like A Teenager But If You Know The Real Age-ఈ బాడీ బిల్డ‌ర్ చూడ‌టానికి యువ‌కుడిలా ఉన్నాడు.. కానీ అస‌లు వ‌య‌సు తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు కూడా బాడీ బిల్డ‌ర్ ఇలాగే క‌నిపిస్తున్నాడు.అత‌న్ని చూస్తే ఎవ్వ‌రికైనా స‌రే 15ఏండ్ల యువ‌కుడిలా క‌నిపిస్తాడు.

కానీ అస‌లు వ‌య‌సు ఎంతో తెలిస్తే మాత్రం నిజంగానే షాక్ అయిపోతారు.జిన్నింగ్ యాన్ అనే వ్య‌క్తి య‌వ్వ‌నం నుంచే బాడీ బిల్డ‌ర్ గా కొన‌సాగుతున్నాడు.

అప్ప‌టి నుంచే నిత్యం ఆరోగ్యం విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త తీసుకుంటారు.ఇప్పుడు అత‌ను చూసేందుకు కండ‌లు తిరిగి ఎంతో బ‌లిష్టంగా య‌వ్వ‌నంగా క‌నిపిస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటో ఒక‌టి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.దీన్నిచూసిన వారంతా నోరు వెళ్లబెడుతున్నారంటే న‌మ్మండి.

అయితే అత‌ని వ‌య‌సు విష‌యంలోనే అంద‌రికీ ఓ షాక్ క‌లుగుతోంది.అదేంటంటే అత‌ని వ‌య‌సు 72 ఏండ్లు.కానీ ఫొటో చూస్తే మాత్రం యువ‌కుడిలా క‌నిపిస్తున్నాడు.దాదాపు పింఛ‌న్ తీసుకునే స‌మ‌యంలో ఈ బాడీ ఏంట్రా బాబు అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.అత‌ను దాదాపు 30 ఏండ్ల‌ నుంచి బాడీ బిల్డింగ్ చేయ‌డం వ‌ల్లే ఇలా బ‌లిష్టంగా ఉన్నాడ‌ని చెబుతున్నాడు.గ‌తంలో కూడా ఇత‌నికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు మ‌రోసారి ఇలాగే అవుతున్నాయి.మ‌రి మీరు కూడా ఆ ఫొటోలు చూసి మీ కామెంట్ ఏంటో కూడా తెలియ‌జేయండి.

#Yan #Bodybuilder #China

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube