ఈ పాప మామూలు అదృష్టవంతురాలు కాదు, నోట్ల కట్టలపై... ఎందుకు ఇలా చేశారో తెలిస్తే షాక్‌ అవుతారు  

This Baby Is Very Lucky-

ఒక మహిళ జీవితం అమ్మ అయిన తర్వాత సంపూర్ణం అవుతుంది, ఇక ఒక మగాడి జీవితం తండ్రి అయితే పరిపూర్ణం అవుతుంది. పెళ్లి అయిన రెండు మూడు సంవత్సరాల్లో తల్లిదండ్రి కాకపోతే ఆ జంట పడే బాధ అంతా ఇంతా కాదు. సెలబ్రెటీల విషయం పక్కన పెడితే సామాన్యులు పిల్లలు లేకుంటే చాలా ఒత్తిడికి గురి అవ్వాల్సి వస్తుంది..

ఈ పాప మామూలు అదృష్టవంతురాలు కాదు, నోట్ల కట్టలపై... ఎందుకు ఇలా చేశారో తెలిస్తే షాక్‌ అవుతారు-This Baby Is Very Lucky

జీవితంలో ఎంత సాధించినా కూడా పిల్లలను సాధించలేక పోయారు అంటూ అంతా కూడా దెప్పి పొడుస్తూ ఉంటారు. అయ్యో పాపం మీకు పిల్లలు లేరా అంటూ కొందరు సూటి పోటి మాటలతో అంటారు, మరి కొందరు ఫంక్షన్స్‌కు రాకుండా దూరం ఉంచుతారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను 20 ఏళ్లు అనుభవించిన ఒక జంటకు ఎట్టకేలకు పాప జన్మించింది. దాంతో వారు ఆనందంకు అవదులు లేకుండా ఉంది.

హర్యానాకు చెందిన వ్యక్తి వృత్తి రీత్యా గుజరాత్‌ వెళ్లాడు. అక్కడ బాగానే సంపాదించాడు. అయితే పెళ్లి అయ్యి 20 ఏళ్లు అయినా పిల్లలు లేకపోవడం అతడికి తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఏం చేయాలో పాలు పోని సమయంలో రకరకాల సలహాలు ఇచ్చారు.

కాని ఏది కూడా వర్కౌట్‌ అవ్వలేదు. చివరకు దేవుడు కనికరించి వారికి పాపను ఇచ్చాడు. లేక లేక పుట్టిన సంతానం అవ్వడంతో ఆ పాపను అల్లారు ముద్దుగా ఆ జంట పెంచడం మొదలు పెట్టారు.

తాజాగా ఆ పాపకు సంబంధించిన ఒక వేడుక నిర్వహించారు. ఆ వేడుకలో భాగంగా పాపను డబ్బుల కట్టలపై పడుకోబెట్టడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. రెండు వేల రూపాయల నోట్లు మరియు రెండు వందల రూపాయల నోట్ల మద్యలో ఆ పాపను పడుకోబెట్టి తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడపిల్ల అంటే చాలా చిన్నచూపు ఉంటుంది. కాని ఆ జంటకు లేక లేక పుట్టిన సంతానం అవ్వడంతో డబ్బుల కట్టలపై పడుకోబెట్టి మరీ పూజ నిర్వహించడం స్థానికంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం అయ్యింది. ఆ పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు అంటూ స్థానికులు అంటున్నారు. ఆడపిల్ల అంటే అదృష్టం అని జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, బృణ హత్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.