అమెరికాలో కర్కోటక తల్లి...ఇంత దారుణానికి ఒడిగట్టిందా..!!!

తల్లి అంటే పిల్లలని కంటికి రెప్పలా చూసుకోవాలి, ఎటువంటి పరిస్థితులలో అయినా సరే పిల్లలపై ఎప్పుడూ జాగ్రత్తగా మెలగాలి.ఎంతో సహనం, ఓర్పు పిల్లల విషయంలో చూపించాలి.

 This American Mother Thing Goesviral-TeluguStop.com

ప్రపంచంలో తల్లులు అందరూ ఇలానే ఉంటారు.కానీ అమెరికాలో ఓ తల్లికి ఏమి కష్టం వచ్చిందో, లేక తన తల్లి హృదయం రాయిలా మారిపోయిందో తెలియదు కానీ 4 ఏళ్ళ పాపని, 10 నెలల బాబుని తుపాకితో కాల్చి చంపేసి తను కూడా కాల్చుకుంది.

ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కన్నీళ్ళు పెట్టించింది.వివరాలోకి వెళ్తే.

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరిగిన ఘటన చుట్టుపక్కల ఉన్నవారిని షాక్ కి గురి చేసింది.టాకోనిలో ఉంటున్న ఆమె ఇంట్లోంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఒక్క సారిగా అందరూ భయబ్రాంతులకి లోనయ్యారు.

వెంటనే పోలీసులకి సమాచారం అందించగా హుటాహుటిన వచ్చిన పోలీసులు ఆ ఇంటి తలుపులు తీయగా ఇద్దరు పిల్లలు చావుబ్రతుకుల మధ్య ఉన్నారు.అదే ఇంట్లో ఓ వ్యక్తి కూడా చనిపోయి ఉండటం గమనించారు పోలీసులు.

Telugu American Mother, Telugu Nri Ups, Telugu Ups-

  ఆ మూడు మృత దేహాలతో పాటు 28 ఏళ్ళ మహిళా కూడా గాయాలతో ఉండటంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.అయితే చనిపోయిన పిల్లలు ఆమె పిల్లలుగా గుర్తించిన పోలీసులు.చనిపోయిన వ్యక్తికి, పిల్లలకి, ఆమె కి ఉన్న సంభంధంపై ఆరా తీస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube