అమెరికాలో థాంక్స్ గివింగ్ డే అంటే అమెరికన్స్ కి ఎంతో స్పెషల్.కోట్లాది మంది అమెరికన్స్ ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటారు.
అయితే ఈ రోజును పురస్కరించుకోవడం లో ఓ జంట మాత్రం ఎవరూ చేయనట్టుగా చాలా స్పెషల్ గా చేయాలనీ భావించింది.అందరూ ఎంతో సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటూ తమకు ఇష్టమైన ఆహారం తింటారు కానీ పేద ప్రజలు, వారి పిల్లలు మాత్రం ఎప్పటిలానే ఉంటారు కాబట్టి వారికోసం ఏదన్నా చేయాలని అనుకున్నారు, చేసేశారు దాంతో ఇప్పుడు ఈ జంట అమెరికాలో ఫుల్ ఫేమస్ అయ్యింది.
కేవలం అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ జంటపై ప్రశంసలు కురుస్తున్నాయి…వివరాలలోకి వెళ్తే.
ఎమిలీ బగ్ ,బిల్లీ లూయిస్ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు .పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆ జంట కరోనా కారణంగా అది సమంజసం కాదని అనుకున్నారు.
దాంతో ఎంతో సింపుల్ గా పెళ్లి చేసుకుని పెళ్ళికి అయ్యే ఖర్చును ఏదన్నా మంచి పనికి వాడాలని భావించారు.పెళ్లిని ఓ సిటీ హాల్ లో సింపుల్ గా కానిచ్చేసి మిగిలిన 5 వేల డాలర్ల ను పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఖర్చు చేయాలనీ అనుకున్నారు.దాంతో
స్థానికంగా ఉన్న ఓ స్వచ్చంద సంస్థ ఖాతాలో ఈ సొమ్మును జమచేసి వారి ద్వారా థాంక్స్ గివింగ్ డే రోజున పేద ప్రజలకు ఆహారాన్ని అందించేలా ప్లాన్ చేశారు.దాదాపు 200 మంది పేద ప్రజల ఆకలి తీర్చారు ఈ జంట.స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన ఫుడ్ డ్రైవ్ లో ఈ జంట నేరుగా పాల్గొన్నారు కూడా.ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఎంతన్నా 5వేల డాలర్లు కరోనా సమయంలో ఖర్చు చేయడం అది కూడా పేదవారి ఆకలి తీర్చడానికి అంటే మరి ఆ జంటను మెచ్చుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి.