రజనీకాంత్ కు ఆ ధైర్యం లేదంటూ ...?  

Thirunavukkaras Sensationl Coments On Rajanikanth Political Entry-

రాజకీయాల్లోకి వస్తానంటూ చాలా కాలంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులను ఊరిస్తూ వస్తున్నాడు.దీంతో ఆయన రాకకోసం అటు అభిమానులు, ఇటు రాజకీయ నాయకులు ఆసక్తిగా గా ఎదురుచూపులు చూస్తున్నారు.

Thirunavukkaras Sensationl Coments On Rajanikanth Political Entry- Telugu Viral News Thirunavukkaras Sensationl Coments On Rajanikanth Political Entry--Thirunavukkaras Sensationl Coments On Rajanikanth Political Entry-

కానీ రజిని పొలిటికల్ ఎంట్రీ మాత్రం జరగడం లేదు.రజిని రాజకీయ ఎంట్రీపై ఎప్పటి నుంచో రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.

ఆయన సొంతం గానే పార్టీ పెడుతున్నారని, కాదు కాదు బీజేపీతో ఆయన ప్రయాణం ఉండబోతుందని, ఇలా ఎవరికి వారు విశ్లేషణ చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో అసలు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేంత ధైర్యం కూడా లేదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ కు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని, కేవలం తాను నటించిన ఒక్కో చిత్రం విడుదల కోసమే ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారని ఆయన వివాస్పద వ్యాఖ్యలు చేశారు.పనిలో పనిగా కమల్ హాసన్ కూడా చురకలు అంటించారు.

కమలహాసన్ చాలా అందంగా ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నారు అనే విషయం ప్రజలకు బాగా అర్థం అవుతుంది అంటూ తిరునావుక్కరస్ చెప్పుకొచ్చాడు.అయితే ఈ వ్యాఖ్యలపై అటు రజిని నుంచి కానీ ఇటు కమల్ హాసన్ నుంచి గాని ఎటువంటి వివరణ ఇప్పటివరకు రాలేదు.