" ఈటెల'' తో ముప్పేనా ? టీఆర్ఎస్ లో ఆందోళన ?

ఏదో అనుకుంటే మరేదో అయ్యింది అంటూ ఇప్పుడు టిఆర్ఎస్ అంతర్మధనం లో పడినట్లుగా కనిపిస్తోంది రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి లకు  వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎవరైనా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప ఎవరు అసంతృప్తి రాగం వినిపించిన పరిస్థితి మీకు వస్తుంది అనే సంకేతాలను ఇచ్చింది.

 Thirty With  Etala  Anxiety In Trs,  Trs, Bjp , Etal Rajendher , Cm Kcr  , Bandi-TeluguStop.com

 రాజేందర్ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతానని అయితే సొంత పార్టీని ముందుకు నడిపించడంలో ఆయన విఫలం అవుతారని, తెలంగాణ ఉద్యమం తరువాత పుట్టుకొచ్చిన ఎన్నో పార్టీ ల మాదిరిగానే రాజేందర్ పార్టీ కూడా కనుమరుగైపోతుందని, ఆ విధంగా రాజకీయ ఉనికి లేకుండా చేయవచ్చు అనే ఎత్తుగడ టిఆర్ఎస్ అయితే అనూహ్యంగా రాజేందర్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న కాకుండా టిఆర్ఎస్ బిజెపి ల మధ్య ఉన్న అంతర్గత సాహిత్యంపైన బిజెపి అగ్రనేతలను ప్రశ్నించడం,  భవిష్యత్తులోనూ టిఆర్ఎస్ తో బిజెపి పొత్తు పెట్టుకోకుండా ముందుగానే హామీ తీసుకోవడం, కెసిఆర్ పై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు బిజెపి పెద్దల నుంచి ముందుగానే అనుమతి కోరడంతో పాటు,  కేంద్రంలో కీలకమైన పదవిని హామీగా పొందడం ఇవన్నీ టిఆర్ఎస్ లో ఆందోళన పెంచుతున్నాయి.

Telugu Bandi Sanjay, Etela Rajender, Jp Nadda, Kcr, Rajendar Delhi, Telangana-Po

 తెలంగాణలో రాజేందర్ వ్యవహారాలపై విచారణ చేయించి ఆయనను ఇరుకున పెట్టాలని తాము భావిస్తే, రాజేందర్ బిజెపి ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం లోని అవినీతి వ్యవహారాలపై ప్రచారం చేయించే దిశగా అడుగులు వేస్తుండటం, రానున్న రోజుల్లో తమ పార్టీని దెబ్బతీసే విధంగా బీజేపీతో కలిసి అప్పుడే ప్రణాళికలు రచించడం ఇవన్నీ ఆందోళన పెంచుతున్నాయి.అది కాకుండా టిఆర్ఎస్ కు సంబంధించి ఎన్నో రహస్యాలు రాజేందర్ కు తెలియడం , మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండడంతో కెసిఆర్ రాజకీయ వ్యూహాలను ముందుగానే పసిగట్టగల నేర్పు ఉండడంతో , టిఆర్ఎస్ ఇంతగా భయ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu Bandi Sanjay, Etela Rajender, Jp Nadda, Kcr, Rajendar Delhi, Telangana-Po

ముందు ముందు బీజేపి సహకారంతో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్లే స్పీడ్ పైనే టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికీ టిఆర్ఎస్ లోనే ఉంటూ పార్టీ పై అసంతృప్తి, తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని బాధ తో చాలామంది నాయకులు ఈటెల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉండడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube