థర్డ్ అంపైర్ ఏమైనా కళ్ళకు గంతలు కట్టుకున్నడా..?! వివాదాస్పదంగా మారిన సూర్య కుమార్ ఔట్..!

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టుపై 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో టి20 సిరీస్ 2-2 లెవెల్ కి చేరుకుంది.

 Third Umpire Decision On Surya Kumar Dismissal In Fourth T20 Vs England Become V-TeluguStop.com

ఐతే ఇషాంత్ కిషన్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఈ టి 20 సిరీస్ ద్వారానే క్రికెట్ కి పరిచయమైన విషయం తెలిసిందే.అయితే సూర్యకుమార్ యాదవ్ కి మొదటి మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు.

కానీ గురువారం రోజు అతడికి తన ప్రతిభను చాటే అవకాశం దక్కింది.దీంతో అతను అర్థ శతకం చేసి ఆశ్చర్యపరిచారు.31 బంతుల్లో 3 సిక్సులు, 6 ఫోర్లు బాది 57 రన్స్ చేసిన సూర్య కుమార్ థర్డ్ అంపైర్ కారణంగా బౌండరీ బాట పట్టాల్సి వచ్చింది.

సామ్ కుర్రాన్ విసిరిన బంతిని సూర్య కుమార్ కొట్టగా దాన్ని డీప్ స్క్వేర్ లెగ్ లో డేవిడ్ మలాన్‌ క్యాచ్ పట్టాడు.

బంతి నేలను తాకుతున్న సమయంలో డేవిడ్ క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ రివ్యూ కి ఇచ్చారు.అయితే అంపైర్ కె.ఎన్.అనంతపద్మనాభన్ అవుట్ అని తన నిర్ణయాన్ని ప్రకటించారు.నిజానికి ఇది ఔటా? కాదా? అనే విషయం తెలుసుకోవడానికి చాలాసార్లు రిప్లై లో పరిశీలించారు.ఈ రిప్లై లలో బంతి నేల ని తాకినట్టు స్పష్టంగా కనిపించింది.

కానీ కె.ఎన్.అనంతపద్మనాభన్ మాత్రం ఔట్ ఇచ్చి అందరి ఆగ్రహానికి కారణమవుతున్నారు.

ముఖ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్లు థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని వేలెత్తి చూపుతున్నారు.కళ్లకు గంతలు కట్టుకుని అంపైర్ నిర్ణయం ఇచ్చారని వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్ వేశారు.దీన్ని ఎలా ఔట్ ఇస్తారంటూ లక్ష్మణ్ కూడా ప్రశ్నించారు.

నిర్ణయం ప్రకటించే ముందు ఇతర అంపైర్ల నిర్ణయం తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో ఔట్ ఇవ్వడంపై నెటిజనులు కూడా మండిపడుతున్నారు.సుందర్ ఔట్ పై అంపైర్ ఇచ్చిన తీర్పుపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.

సుందర్ ది ఔట్ కాదని.సిక్స్ అని నెటిజన్లు థర్డ్ అంపైర్ ని ఏకి పారేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube