పవన్ సినిమా నుంచి మరో చార్ట్ బస్టర్.. వచ్చేది అప్పుడే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తూ రెండింటినీ బాలన్స్ చేస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

 Third Song Pawan Kalyan Vakeel Saab Ready For Release-TeluguStop.com

ఒకే సారి రెండు మూడు సినిమాలు చేస్తూ ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసాడు.
వకీల్ సాబ్ హిందీ పింక్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.అంజలి, నివేతా థామస్ ఈ సినిమాలో కీలక రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నాడు.వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 Third Song Pawan Kalyan Vakeel Saab Ready For Release-పవన్ సినిమా నుంచి మరో చార్ట్ బస్టర్.. వచ్చేది అప్పుడే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే సత్యమేవ జయతే అనే సాంగ్ ను విడుదల చేసారు.

అంతకముందు వచ్చిన మగువ మగువ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు మూడవ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టు రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ట్విట్టర్ లో అయన ట్వీట్ చేస్తూ.నిన్న రాత్రి విన్నాం.

ముచ్చటగా ముద్దుగా.హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది.

రాస్కోరా సాంబా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెబుతూ తెలిపాడు.అంతేకాదు థమన్ కు థాంక్స్ చెబుతూ మరొక వారంలో అద్భుతమైన సాంగ్ రాబోతుందని తెలిపారు.

#Pawan Kalyan #Thaman #Maguva Maguva #Vakeel Saab #ThirdSong

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు