ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా ఇవాళ విడుదల కానుంది.ఈ మేరకు మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది.

ఇప్పటికే సీపీఐతో పొత్తు అంశం కూడా కొలిక్కి వచ్చింది.ఈ క్రమంలోనే కొత్తగూడెం నియోజకవర్గ స్థానాన్ని కాంగ్రెస్ వదులుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు రెండు జాబితాల్లో వంద నియోజకవర్గ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.తాజాగా ఒక సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ మిగతా 18 స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది.

మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీకి చేయనుండగా సీనియర్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయని సమాచారం.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు