నాని కోసం ముచ్చటగా ముగ్గురు!

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా, దానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.కాగా ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.

 Third Heroine In Nani Shyam Singha Roy-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే ‘టక్ జగదీష్’ చిత్ర షూటింగ్‌లో నాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తికాక ముందే తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
శ్యామ్ సింఘ రాయ్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా అందాల భామ సాయి పల్లవితో పాటు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.అయితే ఈ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్‌ను కూడా ఓకే చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మూడో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఇందులో మూడో హీరోయిన్‌గా అందాల భామ నివేదా థామస్ లేదా అదితి రావు హైదరీని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఇప్పటికే నాని ‘వి’ చిత్రంలో ఈ ఇద్దరు బ్యూటీలు కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరోసారి వారిలో ఒకరిని శ్యామ్ సింఘ రాయ్ చిత్రంలో తీసుకుని నానితో వారి ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.

ఇక పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తీర్చిదిద్దుతుండగా, ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.జనవరిలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube