రెండోసారి ప్రేమలో పడితే ఇలాంటివి చేయొద్దు-Things You Should Follow In Second Time Love

Things You Should Follow In Second Time Love -

మొదటిప్రేమ మరువలేనిది అంటారు.నిజమే కాని, తొలిప్రేమే సఫలం అవడం చాలా తక్కువగా చూస్తాం.

చిన్నవయసులో ప్రేమలో పడటం వలనో, ప్రేయసి/ప్రేమికుడితో ఎలా మెలగాలో అర్థం కాకపోవడం వలనో కాని, తొలిప్రేమ చాలామందికి విఫల అనుభవంగానే మిగిలిపోతుంది.అయితే మాత్రం జీవితం ఆగిపోతుందా ! లేదు కదా.

 Things You Should Follow In Second Time Love-Things You Should Follow In Second Time Love-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్ళీ మరొకరితో చూపులు కలుస్తాయి.మళ్ళీ ప్రేమలో పడతాం.

కాని రెండోవసారి ప్రేమలో పడినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి.

అసలేం చేయాలో, ఏం చేయకూడదో చూద్దాం.

* కష్టాల్లో ఉన్న జీవితానికి తన ప్రేమ వలన ఎంత ధైర్యం, అర్థం వచ్చిందో చెప్పండి.

* మీ మాజీ ప్రేయసి/ప్రేమికుడు ఎంత మంచివారైనా, వారి గురించి పొగడడం మాత్రం వద్దు.

* నువ్వు ఇలా చేసావ్, తనైతే ఇలా చేసుండేవాడు/చేసుండేది … ఇలాంటి పోలికలు మాత్రం అస్సలు పెట్టొద్దు.

* మీ మాజీ ప్రేమలో ఏమైనా కష్టాలు పడుంటే, ఒక్కసారి చెప్పుకుంటే చాలు.దాన్ని పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు.

* ఇది చాలా ముఖ్యమైన విషయం.మీ మాజీ లవర్ అందంగా ఉండుంటే అది మీ దాకే ఉంచండి.

పొరపాటున కూడా ఆ టాపిక్ తీసుకురావొద్దు.

* ఇక చివరి పాయింట్, మీరు ఏం తక్కువ చేయడం వలన మీ మొదటి ప్రేమ విఫలం అయ్యిందో, దాన్ని ఇక్కడ తక్కువ చేయకండి.

మీరు చేసిన పొరపాట్లు, మాట్లాడిన పద్ధతి, ఇలా మీ మొదటిప్రేమ అపజయానికి కారణమైన కారణాలేవి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు