కంపు కొట్టే కాస్టలీ ఫ్రూట్..! ఒక్కోటి 70 వేలకు పైనే..! అంత స్పెషల్ ఏంటి.? జనం ఎందుకు ఎగబడుతున్నారు?  

  • మీరు చదివింది నిజమే. పైన ఫొటోలో కనిపిస్తున్న ఒక్క పండు 990 డాలర్లు (సుమారు రూ.70 వేలు)కు అమ్ముడుపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే…ఈ పండు అత్యంత దుర్గంధం వెదజల్లే పండు. ఈ పండులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నరా ?

  • ఆగ్నేసియాలో దొరికే ఈ పండు పేరు డురియన్. జే -క్వీన్ హైబ్రిడ్ రకానికి చెందిన ఈ పండును ఇండొనేసియన్లు పండులో రారాజుగా భావిస్తారు. ఇవి గుండ్రటి ఆకారంలో ఉంటూ అరుదుగా లభిచటం వల్లనే వీటికి అంత ధర ఉంటుంది.

  • Things You Need To Know About Durian Fruit-Durian Fruit King Of Southeast Asia

    Things You Need To Know About Durian Fruit

  • డురియన్ పండు కుళ్లిపోవడంతో ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్శిటీనే ఖాళీ చేయించారంటే దాని వాసన ఎంత గాఢత ఉంటుందో చెప్పనక్కర్లేదు. విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ డురియన్ పండుపై నిషేధం విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దుర్గంధపు పండును ఎవరైనా ఇష్టపడతారా? పోను తింటారా? కనీసం కొనేందుకు అయినా ముందుకు వస్తారా? అయినప్పటికీ ఈ జాతి పండు మార్కెట్లో అమ్ముడుపోయింది.

  • పైనున్న డురియన్ పండు ఇండోనేషియాలోని వెస్ట్ జావా ప్రావిన్స్‌లో ఉండే తసిక్‌మలయ ప్రాంతంలోని సూపర్‌మార్కెట్‌లో అమ్ముడుపోయింది. ఈ ఒక్క పండు 14 లక్షల ఇండోనేషియన్ రూపయ్యలకు అమ్ముడుపోవడం విశేషం. ఈ పండును కొన్న వ్యక్తి పేరును రహస్యంగా ఉంచారు. అయితే అతడు ఓ డురియన్ లవర్ అని సదరు సూపర్‌మార్కెట్ మేనేజర్ హేరియావన్ తెరెన్ చెప్పాడు.