యాపిల్ ఫోన్( Apple iPhone ) వాడాలనే కోరిక అందరిలో ఉంటుంది.కానీ బడ్జెట్ పరంగా అధిక ధర ఉండడంతో చాలామంది విదేశాల నుండి తెప్పించుకుంటే ఐఫోన్ ధర తక్కువగా ఉంటుంది అని భావించి విదేశాలలో తెలిసిన వారు ఉంటే వారి ద్వారా ఐఫోన్ తెప్పించుకుంటున్నారు.
దేశాల నుండి ఐఫోన్స్ తెప్పించుకునే వారు ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.

భారత మార్కెట్లో ఐఫోన్15 ప్రో మాక్స్ ధర రూ.159900 గా ఉంది.ఐఫోన్ 15 ప్రో ధర రూ.134900 గా ఉంది.అదే అమెరికా, దుబాయ్ లలో అయితే ఐఫోన్ ధర కాస్త తక్కువగా ఉంటుంది.
అయితే విదేశాల్లో లభించే ఐఫోన్లతో ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి.ఆ సమస్యలలో ప్రధాన సమస్య ఏమిటంటే అబ్రాడ్ లో దొరికే ఐఫోన్స్ లో ఫిజికల్ సిమ్ స్లాట్ ఉండదు.
అమెరికాలో యాపిల్ కంపెనీ ఫిజికల్ స్లిమ్ స్లాట్ ను ఆపేసింది.అమెరికాలో దొరికే ఐఫోన్ లలో ఇ-సిమ్ మాత్రమే ఉంటుంది.
ఇక దుబాయ్ వంటి దేశాలలో లభించే ఐఫోన్లలో సింగిల్ సిమ్ స్లాట్( Single SIM slot ) మాత్రమే ఉంటుంది.విదేశాల నుండి ఐఫోన్ తెప్పించుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

భారత మార్కెట్లో దొరికే ఐఫోన్ లో ఫిజికల్ సిమ్, ఒక ఇ-సిమ్ ఆప్షన్ ఉంటుంది.హాంగ్కాంగ్ లో దొరికే ఐఫోన్ లో రెండు ఫిజికల్ సిమ్ స్లాట్లు ఉంటాయి.మరొక విషయం ఏమిటంటే.విదేశీ ఫోన్ లకు ఇంటర్నేషనల్ వారంటీ( International Warranty ) ఉందో లేదో చెక్ చేసుకోవాలి.విదేశాల నుండి ఐఫోన్స్ తెప్పించుకునే ముందు ఫ్యాక్టరీ లాక్ లేని మొబైల్స్ తీసుకోమని బంధువులకు చెప్పాలి.ఎందుకంటే ఫేక్ ఐఫోన్ మోడల్స్ విదేశాల్లో ఎక్కువ గా ఉంటాయి.
ఐఫోన్ కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సరైన ప్రోడక్ట్ అయితేనే కొనుగోలు చేయమని చెప్పాలి.ఈ విషయాలపై అవగాహన ఏర్పడిన తర్వాతనే విదేశాల నుండి ఐఫోన్ ను కొనుగోలు చేయాలి.