కొత్త ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా..?! అయితే వీటిని ఖచ్చితంగా గమనించండి..!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అనేక కంపెనీలు ఇంటి నుంచి పని చేయడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి.ఈ నేపథ్యంలో చాలా మంది ఇంటిదగ్గర కంప్యూటర్ లేకపోవడంతో ఉద్యోగాలను కాపాడటం కోసం అనేక మంది ల్యాప్ టాప్ లను కొనడానికి ఉత్సాహత చూపుతున్నారు.

 Things To Consider When Buying A New Laptop Or Computer, Laptop, Computer, Speci-TeluguStop.com

ఇకపోతే త్వరలో పండగ సీజన్ రాబోతోంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి అనేక ఆన్లైన్ దిగ్గజ కంపెనీలు పెద్ద మొత్తంలో డిస్కౌంట్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఇలా కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు డబ్బులను సేవ్ చేసుకోవచ్చు.

ఇకపోతే ల్యాప్టాప్, కంప్యూటర్ ఎలాంటి అవసరాల కోసం కొంటున్నారో అన్న విషయాన్ని మీరు ముందుగా తెలుసుకొని మీ అవసరాలకు తగ్గట్టుగా వాటిని ఎంచుకోండి.

మీరు ఎక్కువగా గ్రాఫిక్స్ లేదా గేమింగ్ లాంటి అవసరాల కోసం కొనాలనుకునేవారు intel i7 లాంటి శక్తివంతమైన ప్రాసెసర్ ను కలిగి ఉన్న వాటిని కొనడం మంచిది.లేకపోతే కేవలం బ్రౌజింగ్ లేదా చిన్న చిన్న అవసరాల కోసం, ఆన్లైన్ క్లాసులు వంటి వినడానికి కోసం కేవలం intel i3 ప్రాసెసర్ తీసుకుంటే సరిపోతుంది.

అంతేకాదు కొన్ని హార్డ్ వేర్ విషయంలో కూడా వీలైనంత వరకు నిపుణుల సూచన మేరకు ఎలాంటి కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కొనాలో నిర్ధారించుకోండి.కేవలం ప్రాథమిక అవసరాల కోసం ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ సరిపోతుంది.

ఇందుకోసం కేవలం 25 నుండి 30 వేల వరకు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది.అదే మీరు చేసే పనులు కాస్త ఎక్కువ మోతాదులో ఉంటే అందుకోసం కచ్చితంగా మీరు 50 వేల నుండి లక్ష వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వీటితో పాటు మీరు ఎక్కువ సేపు ల్యాప్ టాప్ ను మోసే పరిస్థితి ఉంటే మీరు కచ్చితంగా తక్కువ బరువు ఉన్న వాటిని ఎంచుకుంటే చాలావరకు మేలు.లేదు ఇంట్లోనో.

లేకపోతే ఆఫీసులోనో కూర్చొని పని చేసే విధంగా ఉంటే అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఎంచుకుంటే సరిపోతుంది.లాప్ టాప్స్ సరాసరి 1.5 కిలోల నుండి 2.5 కిలోల మధ్యలో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి.అలాగే తీసుకున్న ల్యాప్ టాప్ కు అన్ని రకాల కేబుల్స్ కనెక్టివిటీ చేసుకునే విధంగా ఉన్నాయో లేదో చుకోవాలి.మీరు కొంటున్న ల్యాప్ టాప్ లో కనీసం 8gb ర్యామ్ ఉండేవిధంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది.

అంతేకాదు ల్యాప్ టాప్ మీద ఉన్న కీ ప్యాడ్ లో కూడా రాత్రి సమయంలో అయినా సరే బాగా కనిపించే విధంగా ఉన్న మోడల్ ను ఎంచుకుంటే చాలా ఉపయోగపడుతుంది.వీటి అన్నిటి కన్నా ముఖ్యమైనది బ్యాటరీ బ్యాకప్.

బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తున్న వాటిని ఎంచుకుంటే ఒకవేళ ఏదైనా పవర్ ప్రాబ్లం ఉంటే ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube