బొడ్డుని శుభ్రం చేసుకోవడం మరిచిపోతున్నారా?అయితే మీరే స్వయంగా మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.!

Things That You Didnt Know About Dirty Belly Buttons

నిత్యం వ్యాయామం, త‌గిన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌ర‌మో, దాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా అవ‌స‌ర‌మే.లేదంటే ఎన్నో ర‌కాల అనారోగ్యాలు వ్యాపించే అవకాశం ఉంటుందియ.

 Things That You Didnt Know About Dirty Belly Buttons-TeluguStop.com

శ‌రీరం మొత్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.అయితే నిత్యం స్నానం చేస్తూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నా అధిక శాతం మంది మ‌రిచిపోయే భాగం ఒకటుంది.

అదే బొడ్డు.

అవునండీ,బొడ్డుని శుభ్రం చేసుకోవడం చాలా మంది మర్చిపోతుంటారు.

మ‌న శ‌రీరం మధ్య భాగంలో ఉండే నాభి.చాలా మంది స్నాన‌మైతే చేస్తారు కానీ బొడ్డును స‌రిగ్గా శుభ్రం చేసుకోరు.

దీంతో ఆ ప్రాంతంలో బాక్టీరియా పేరుకుపోయి వివిధ ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి.సైంటిస్టులు చెబుతున్న‌దేంటంటే బొడ్డులో దాదాపు 67 ర‌కాల బాక్టీరియాలు నివాసం ఉంటాయ‌ట.

ఈ క్ర‌మంలో బొడ్డును స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోతే వ్యాధుల బారిన ప‌డ‌క త‌ప్ప‌ద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

క‌నీసం వారానికి ఒక సారైనా బొడ్డును శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్యాల‌ను నివారించ‌వ‌చ్చు.

బొడ్డు లోప‌లి భాగం పైకి ఉన్న‌వారు సాధార‌ణ స‌బ్బుతో క్లీన్ చేసుకున్నా చాలు.కానీ బొడ్డు బాగా లోతుగా ఉన్న‌వారు ప‌లు సూచ‌న‌లు పాటిస్తే బొడ్డును శుభ్రంగా ఉంచుకోవ‌చ్చు.

స‌బ్బు నీళ్ల‌ను బొడ్డులో పోస్తూ కాటన్ బాల్స్ వంటివి పెట్టి తిప్ప‌డం ద్వారా, క్లీనింగ్ ఆల్క‌హాల్ ద్వారా బొడ్డును శుభ్రం చేసుకోవ‌చ్చు.దీంతో బొడ్డు శుభ్రంగా ఉండి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube