భార్యకు చికాకు తెప్పించే పనులు ఇవి

ఇద్దరి మనసులు కలిసినంత మాత్రానా, ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయని కాదు, అలాగే అభిరుచులు కలుస్తాయని కాదు.భర్త చేసే కొన్ని పనులు భార్యకి నచ్చకపోవచ్చు, భార్య చేసే కన్ని పనులు భర్తకి నచ్చకపోవచ్చు.

 Things That Really Irritate Wives-TeluguStop.com

ఈరోజైతే, భర్తలు చేసే కొన్ని పనులు భార్యలకి ఎలా చికాకు తెప్పిస్తాయో చూద్దాం.

* మొదటగా, భార్యకి ఎప్పుడు ఆర్డర్స్ వేయకూడదు.

ఆమెతో ఏదైనా పని చేయించుకోవాలంటే, ఓ పద్దతిగా లేదా ప్రేమగా అడగటమే మంచిది.అలా కాకుండా ఎదో పనిపిల్లకి చెప్పినట్టు ఆర్డర్స్ వేస్తె, రాను రాను భర్త తన గౌరవం కోల్పోతుంటాడు.

అవసరం లేని చోట్ల కూడా భార్య సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించడం మొదలుపెట్టవచ్చు.

* ఓసారి భర్త తన పాత ప్రేమకథ గురించి చెప్తే ఒకే, మంచివాడు, ఏది దాచుకోకుండా చెప్పేసాడు అని అనుకుంటుంది భార్య.

కాని ఒకనాటి ప్రేయసి గురించి భర్త చాలాసార్లు చెప్తే ఏ భార్యకైనా చిరాకుగా అనిపించడం సబబే.

* ప్రతీ విషయంలో భార్యని తన తల్లితో పోల్చి తప్పు చేస్తుంటారు కొందరు మగవారు.

ఇలా చేస్తే కోపంతో పాటు బాధ, రెండురకాల భావోద్వేగాలకు ఒకేసారి లోనవుతుంది భార్య.

* ఓ మాట కూడా చెప్పకుండా, నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆమెకి కోపం తెప్పించే విషయమే.

ప్రతీ నిర్ణయంలో ఇద్దరి అభిప్రాయాలు ఉండేలా చూసుకోవాలి.

* స్నేహితులను ఎక్కువగా ఇంటికి తీసుకురావడం కూడా భార్యలకు నచ్చకపోవచ్చు.

ఈ విషయాన్ని కూడా మగవారు అర్థం చేసుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube