బుధవారం ఈ వస్తువులు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

What Happens When You See Cow Eating Grass On Wednesday, Wednesday, Coconut, Lord Vishnu, Monkey, Dog, Snake

శ్రీ మహా విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం.అలాంటి బుధవారం రోజున స్వామి వారిని పూజించడం వల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.

 What Happens When You See Cow Eating Grass On Wednesday, Wednesday, Coconut, Lor-TeluguStop.com

బుధవారం ఉదయం లేవగానే కొన్ని వస్తువులు మన కళ్ళకు కనిపించడం వల్ల అదృష్టం వరిస్తుంది.మరి ఏంటి ఆ వస్తువులు? నిద్ర లేవగానే ఎటువంటి వస్తువులను చూడడం వల్ల అదృష్టం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం….

బుధవారం బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు. బుద్ధుడి అనుగ్రహం లేకుండా మనం ఎటువంటి కార్యం తలపెట్టిన సవ్యంగా జరగదు.ఆ పనులు నెరవేరాలంటే బుధ గ్రహ పూజలు ఆచరించాలి.అలా చేయడం వల్ల కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న పనులు సక్రమంగా జరుగుతాయి.

బుధవారం నిద్ర లేవగానే కొబ్బరికాయ కనిపిస్తే మనకు ఎటువైపు నుంచి అయిన ధన లాభం కలుగుతుందని సంకేతం.ఆవు గడ్డి మేస్తూ కనిపిస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందని సంకేతం.

మీ కలలో తెలుపు లేత బంగారు వర్ణం లో పాములు చూసినట్లయితే, మీ మార్గంలో డబ్బు ఉందని స్పష్టమైన సూచన.
మీరు బుధవారం ఉదయం ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయలుదేరే సమయంలో మీ వాహనం కుడివైపున కోతి, కుక్క, పాము లేదా ఏదైనా పక్షిని కానీ చూస్తే మీరు త్వరలో ధనవంతులవుతారు.

ఆలయ గంటలు లేదా కొన్ని శ్రావ్యమైన భజనల శబ్దాలకు మేల్కొనడం వల్ల నీకు అదృష్టం కలిసిరావడంతో పాటు డబ్బును రెట్టింపు చేస్తుంది.బుధవారం ఉదయాన్నే నిద్ర లేవగానే పాలు లేదా పెరుగు వంటి తెల్లని పాల ఉత్పత్తులను చూసినట్లయితే, మీరు ధనవంతులు కావడానికి సంకేతం.

అంతేకాకుండా బుధవారం ఉదయం విష్ణు దేవాలయాన్ని సందర్శించి సంపంగి పూలతో పూజించి, నెయ్యి తో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమేకాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.బుధవారం ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయడం వల్ల సుఖ సంతోషాలను కలిగి ఉంటారు.

Video : What Happens When You See Cow Eating Grass On Wednesday, Wednesday, Coconut, Lord Vishnu, Monkey, Dog, Snake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube