భోజనం తరువాత చేయకూడని పనులు ఏంటంటే     2016-12-25   03:35:03  IST  Lakshmi P

భోజనం తరువాత మీరేం చేస్తారు? కొందరు పడుకుంటారేమో, మరికొందరు వాకింగ్ చేస్తారేమో .. ఒక్కక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరైతే తిన్న తరువాత వాకింగ్ చేస్తే మంచిదని, తిన్న తిండి బాగా అరుగుతుందని వాదిస్తారు. అయితే అది పూర్తిగా అపోహ. ఓరకంగా చెప్పాలంటే మంచి అలవాటు కాదు. తిన్న తరువాత చేసే పనులు కూడా మన జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. కాబట్టి తిన్న వెంటనే చేయకూడని పనులేంటో చూద్దాం.

* తిన్న వెంటనే కాఫీ కాని టి కాని ఎప్పుడూ తాగొద్దు. వీటిలో ఉండే ప్రాపర్టీస్ అలాంటి సమయంలో శరీరాన్ని ఐరన్ సరిగా తీసుకోనివ్వవు.

* భోజనం నిద్ర ఎంత ముంచుకొచ్చినా నిద్రపోవద్దు. మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంఫేక్షన్స్ కడుపు లోనికి వస్తాయి.

* భోజనం అయిన వెంటనే ఫలాలు కూడా తీసుకోవద్దు. అప్పుడు ఓ క్రమంలో ఉన్న డైజెషన్ ప్రాసెస్ ని అది డిస్టర్బ్ చేయవచ్చు. కాస్త గ్యాప్ ఇచ్చి పండ్లు తినండి.

* తిన్న వెంటనే వాకింగ్ చేయడం మంచి అలవాటు కానే కాదు. అది కాలరీలు బర్న్ చేయడానికి పనికిరాదు. డైజెషన్ ప్రాసెస్ కి కావాల్సిన ఎనర్జీని మళ్ళించిన వారవుతారు. ఓ అరగంట తరువాత వాకింగ్ చేస్తే అది వేరు విషయం. అలాగే తిన్న వెంటనే వ్యాయామం కూడా వద్దు.

* సిగరెట్లు కాల్చడమే ప్రమాదం అంటే, తిన్న వెంటనే కాల్చడం ఇంకా ప్రమాదం. అలాగే తిన్న తరువాత స్నానం వద్దు.