మొటిమలు ఉన్నవారు ఇది మరచిపోకండి     2016-06-08   06:26:07  IST  Lakshmi P

జిడ్డు చర్మం ఉన్నవారి ఇబ్బందులు ఒకటిరెండు కాదు. స్నానం చేసుకున్న కాసెపటికే తాజాదనం వెళ్ళిపోతుంది. ఎండలో తిరిగితే మొటుమలు, నూనే పదార్థాలు తింటే మొటిమలు, పాల పదార్థాలు తింటే మొటిమలు, బయటి తిండి తిన్నా మొటిమలు, ఇలా రోజంతా మిగితావారు చేసే ఎన్నోపనులు వారికి ఏ హాని చేసినా చేయకపోయినా, ఆయిలి స్కిన్ ఉన్నావారికైతే కీడు చేస్తాయి. సరే రోజంతా ఎండలో ఎక్కువగా తిరగకుండా, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకుండా ఎలాగోలా కొరికల్ని అదుపులో పెట్టుకోని ఉంటారు కాని, రాత్రంతా అయిల్ స్కిన్ ని ఎలా కాపాడుకోవాలి?

ఆయిల్ రాత్రపూట చాలా వస్తుంది. అందుకే తెల్లారి లేచేసరికి మొహం మీద మొటిమలు చేరిపోతాయి. అందుకే అయిలీ స్కిన్ ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మరచిపోకూడదు. గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోని, కాటన్ తో తడుచుకుంటే మంచిది. అలాగే దిండు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ముఖం సురక్షితంగా ఉంటుంది.

ఇక తెల్లారి లేచిన వెంటనే ముఖాన్ని మళ్ళీ శుభ్రపరుచుకోని, కనీసం ఓ రెండు గ్లాసుల నీళ్ళు తాగాలి. ముఖాన్ని శుభ్రపరుచుకోవడం కోసం రోజ్ వాటర్ కూడా వాడొచ్చు.