శనివారం ఇవి కొంటున్నారా..? అయితే దరిద్రమంతా మీ చుట్టే!

శనివారం నాడు శనిదేవుడికి పూజలు చేస్తారు.తమపై శని దోషాలు పడకూడదని కోరుకుంటారు.ఆలయాల్లో శని దోష నివారణ పూజలు జరుగుతాయి.ఐతే… ఇలాంటివి ఏం చేసినా… శనివారం నాడు కొన్ని రకాల వస్తువులు కొంటే మాత్రం అరిష్టం తప్పదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.ఆ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే… ఇక అంతే… ఆ రోజు నుంచి ఇంట్లో సంపద, ఆరోగ్యం బయటకు వెళ్లిపోతూ ఉంటాయి.శనివారం నాడు కొనే వస్తువుల నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ… ఇల్లంతా పాకుతూ… ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని చెబుతున్నారు.

 Things Not To Buy On Saturday Details, Saturday, Shaniswara, Pooja, Avoid Things-TeluguStop.com

ఇలా దరిద్రం చుట్టుకుంటే… వారిని కాపాడలేమని అంటున్నారు.ఆ వస్తువులు ఏవో తెలుసుకుందాం.

ఐరన్ వస్తువులు

శనివారం నాడు ఐరన్‌తో తయారయ్యే ఏ వస్తువులూ కొనకండి.ఐరన్ వస్తువులతో వ్యాపారం చేసేవారు… శనివారం నాడు ఆ వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లూ చేపట్టవద్దంటున్నారు.

శనివారం నాడు ఏ వాహనమూ కొనవద్దని సూచిస్తున్నారు.ఎందుకంటే వాహనాలు కూడా ఐరన్‌తోనే తయారవుతాయి.

ఉప్పు.

శనివారం నాడు ఉప్పును అస్సలు కొనవద్దని సూచిస్తున్నారు.ఉప్పులో నెగెటివ్ ఎనర్జీలను లాక్కునే శక్తి ఉంటుందనీ… దాన్ని శనివారం ఇంటికి తెచ్చుకుంటే.ఇల్లంతా నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని నిపుణులు అంటున్నారు.కాదని ఒక వేళ శనివారం రోజున ఉప్పును కనుక కొనుగోలు చేస్తే అనేక రకాలుగా కష్టాల పాలవుతారని వివరిస్తున్నారు.కావున ఉప్పును శనివారం రోజు ఇంటికి తీసుకురాకపోవడమే చాలా మంచిది.

ఆవ నూనె

ఆవ నూనెను పూజల్లో వాడుతుంటారు.అందువల్ల దాన్ని శనివారం అస్సలు కొనవద్దని సూచిస్తున్నారు.నల్లగా ఉండే ఆవాలను కూడా శనివారం ఇంటికి తెచ్చుకోవద్దని పండితులు అంటున్నారు.

కలప

ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు కలపతో తయారుచేసిన వస్తువులు కొనవద్దంటున్నారు.ఇలా చేయడం వలన అనేక అశుభాలు కలుగుతాయట.

నల్లటి వస్తువులు.

నల్లటి షూస్, నల్లటి బట్టలను శనివారం కొంటే… నెగెటివ్ ఎనర్జీని ఇంటికి తెచ్చుకున్నట్లే అంటున్నారు.నల్లటి ధాన్యాలు, నల్లటి గింజలు, పప్పులు… వంటివి కూడా శనివారం కొనవద్దని సూచిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వస్తువులు.

శనివారం నాడు ఎలక్ట్రిక్ వస్తువులు ఏవీ కొనవద్దని హెచ్చరిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.ఆ రోజున కొంటే… అవి పాడవ్వడమో, ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడమో… ఏదో ఒక చెడు జరుగుతుందని చెబుతున్నారు.

గొడుగులు.

గొడుగులు మనను ఎండ, వాన నుంచి కాపాడతాయి.వీటికి ప్రకృతి శక్తులతో డైరెక్టు సంబంధం ఉంటుంది.

అందువల్ల శనివారం నాడు గొడుగు కొంటే… ఏదో ఒక రోజున దాన్ని బయటకు తీసుకెళ్లినప్పడు… అది ప్రకృతి శక్తులతో నెగెటివ్ ఎనర్జీని రగిలించి.విపత్తుకు దారి తీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube