పిరియడ్స్ లో ఉండగా అమ్మాయిలు చెప్పాలనుకునేవి ఇవే  

Things Girls Want To Say With Men During Periods -

పిరియడ్స్ లో ఉన్నప్పుడు అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి.అప్పుడు అబ్బాయిలు చేసే కొన్ని విషయాలు వారికి నచ్చవు.

గట్టిగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటారు.కొందరు చెప్పాలనుకున్నా బయటకి చెప్పలేరు, మనసులోనే తిట్టేసుకుంటారు.

TeluguStop.com - Things Girls Want To Say With Men During Periods-General-Telugu-Telugu Tollywood Photo Image

అవేంటో చుద్దాం.

* రక్తం ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అని పదే పదే అడుగుతారు ఏంటి ఈ అబ్బాయిలు.

ఇంట్లో వాళ్ళ అమ్మ, చెల్లికి ఇదంతా జరుగుతుంది కదా.అప్పుడు రాలేదా ఈ డౌట్లు.ఎన్నిసార్లు చెప్పాలి, గూగుల్ చేయొచ్చుగా.

* కొన్నిసార్లు పిరియడ్స్ లో కూడా మూడ్ వస్తుంది.అప్పుడు శృంగారం కావాలంటాను.అలాగని పీరియడ్స్ లో ప్రతీసారి మూడ్ రావాలని కాదుగా.

అర్థం చేసుకోరేంటి.

* నా బట్టలు నేను పిండుకోవడానికే ఇబ్బందిగా ఉంది.

నేను పిరియడ్స్ లో ఉన్నప్పుడైనా తన బట్టలు తాను పిండుకోవచ్చుగా.

* ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతాడేంటి.

నా కొపమంతా కావాలని తనమీద తీసినట్టు.

* మూడ్ బాగాలెన్నప్పుడే వచ్చి తిట్లు తింటాడు.

కాసేపు కామ్ గా కూర్చోవచ్చుగా.

* కాసేపు ఏదైనా మాట్లాడించవచ్చు కదా.ఎంతసేపు ఆ టీవీకి అతుక్కుపోతాడు.

* నువ్వు ట్రై చేస్తే మాత్రం మూడ్ రావాలా? రాకపోతే ఇష్టం తగ్గపోయినట్టా? అసలేమైనా లాజిక్ ఉందా దీంట్లో?

* ఈ టైమ్ లో కూడా ఇంటిపనుల్లో సాహాయం చేయడు.ఏం మనిషో ఏంటో !

ఇలా ప్రతి అమ్మాయి తిట్టుకుంటుంది.కొందరు బయటకి తిడతారు.కొందరు లోలోపలే తిడతారు.కాబట్టి జాగ్రత్తగా మెదలండి అబ్బాయిలు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు