మెగా హీరో స్పీడ్ కు బ్రేక్ వేసిన తిక్క..!  

Thikka Breaks Mega Hero Speed -

వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఈరోజు వచ్చిన తిక్క సినిమాతో ఫ్లాప్ కొట్టాడని అంటున్నారు.మొదట నుండి తిక్క సినిమా మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తూనే ఉంది.

ఫైనల్ గా ఈరోజు థియేటర్లో కూడా తేజు తిక్కకు ఆడియెన్స్ కూడా బాబోయ్ అనేస్తున్నారు.రీసెంట్ గా సుప్రీం హిట్ తో సూపర్ క్రేజ్ సంపాదించిన తేజు ఈ తిక్కతో తన స్పీడ్ కు బ్రేక్ వేశాడని చెప్పాలి.

Thikka Breaks Mega Hero Speed--Telugu Tollywood Photo Image

అయితే సినిమా విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు.

లుక్స్ పరంగా తేజు తిక్కలో ఓకే అనిపించుకున్నా సినిమా ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇక నిన్న రిలీజ్ అయిన బాబు బంగారం కూడా మిక్సెడ్ టాక్ తెచ్చుకోవడంతో తిక్క టాక్ దానికి ప్లస్ అవ్వనుంది.సునీల్ రెడ్డి డైరెక్ట్ చేసిన తిక్క సినిమాలో లారిసా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా నటించారు.

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను రోహిణ్ రెడ్డి నిర్మించడం జరిగింది.మెగా ఇమేజ్ కు దూరంగా తేజు తిక్క రిలీజ్ అవడం అది కాస్త నిరాశ పరచడంతో తేజు ఆలోచనలో పడ్డాడట.

మరి తిక్క ఫ్లాప్ తో షాక్ తిన్న తేజు తర్వాత సినిమాల్లో తన తప్పుని తెలుసుకుంటాడేమో చూద్దాం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thikka Breaks Mega Hero Speed Related Telugu News,Photos/Pics,Images..