దొంగతనం కోసం ఏకంగా ఫ్లాట్ కొన్న దొంగలు.. చివరికి..?!

కొంతమంది దొంగలు దొంగతనానికి పాల్పడేందుకు ఎలాంటి సాహసాలు, విన్యాసాలు అయిన చేసి దొంగతనాలకు పాల్పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఏదైనా ఒక ఇంటికి దొంగతనం చేయాలని వారు అనుకుంటే ఎంతటి పనినైనా చేసేందుకు సిద్ధ పాడుతారు వారు.

 Thieves Who Bought A Flat Together For Theft In The End-TeluguStop.com

ఈ తరుణంలో తాజాగా ఒక వ్యక్తి ఇంట్లో దొంగతనం పాల్పడేందుకు.ఏకంగా ఒక ఖరీదున్న ఫ్లాట్ ను కొనుక్కొని దొంగతనానికి పాల్పడ్డారు.

అలాగే ఎన్నో నెలలు కష్టపడి స్వరంగ మార్గం చేసుకొని మరి భారీ మొత్తంలో సొత్తును దొంగతనం చేశారు.ఈ విచిత్రమైన సంఘటన రాజస్థాన్ లోని  జైపూర్ లో  జరిగింది.

 Thieves Who Bought A Flat Together For Theft In The End-దొంగతనం కోసం ఏకంగా ఫ్లాట్ కొన్న దొంగలు.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.జైపూర్ లోని వైశాలిన‌గ‌ర్ కాల‌నీలో నివాసం డాక్టర్ సునీత ఇంటి పక్కనే కొందరు వ్యక్తులు 90 లక్షల రూపాయలు ఖర్చు చేసి కొన్ని నెలల కిందట ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు.

ఆ ప్లాట్ నుండి డాక్టర్ సునీత ఇంట్లోకి ఒక మార్గంగా స్వరంగాన్ని ఏర్పాటు చేసుకొని.డాక్టర్ ఇంట్లో లేని సమయంలో ఆ సొరంగం గుండా డాక్టర్ ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని ఒక బాక్స్ లో భారీ మొత్తంలో ఉన్న వెండిని మొత్తం చోరీ చేశారు.

దీనితో డాక్టర్ సునీత సంఘటనపై స్థానిక పోలీసులను ఆశ్రయించగా.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.ఇక దొంగలించిన వెండి మొత్తం ఆ ప్లాట్ ఖరీదు కంటే తక్కువగానో, ఎక్కువగానో అన్న విషయం ఇంతవరకు తేలలేదు.కానీ, భారీ మొత్తంలో ఉన్న వెండి సొత్తును దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం

#Theft #Bihar #Docters House #Silver #Polices

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు