బిగ్ బాస్ హౌస్‌లో దొంగ‌లు ప‌డ్డారు.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే?  

Thieves broke into Bigg Boss House! Thieves, Bigg Boss House, bigg boss telugu, latest news, bigg boss 4, lasya, harika, noel, akhil, divi - Telugu Akhil, Bigg Boss 4, Bigg Boss House, Bigg Boss Telugu, Divi, Harika, Lasya, Latest News, Noel, Thieves

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.ప్ర‌స్తుతం ఆరో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

TeluguStop.com - Thieves Broke Into Bigg Boss House

ఈ వారం అమీ తుమీ, కొట్టు తలతో ఢీ కొట్టు టాస్కుల‌తో త‌ర్వాత రెండో సారి నోయ‌ల్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యారు.ఇక ర‌చ్చ ర‌చ్చ‌గా సాగిన టాస్కుల అనంత‌రం.

నిన్న‌టి ఎపిసోడ్‌లో భావోద్వేగ సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఇంటి సభ్యులకు తమ చిన్ననాటి ఫొటోలను గిఫ్ట్‌గా పంపిన బిగ్ బాస్.

TeluguStop.com - బిగ్ బాస్ హౌస్‌లో దొంగ‌లు ప‌డ్డారు.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మీ లైఫ్‌లో‌ జరిగిన సంఘటనల్ని షేర్ చేసుకోవాలని ఆదేశించారు.
ఇక ఇంటి స‌భ్యులంద‌రూ త‌మ లైఫ్‌లో కోల్పోయిన‌వి, సంపాదించుకున్న‌వి షేర్ చేస్తూ తెగ ఎమోష‌న్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే వారు క‌న్నీరు పెట్టుకోవ‌డంతో పాటు షో చూసే ప్రేక్ష‌కుల‌ను సైతం క‌న్నీరు పెట్టుకునేలా చేశారు.ఈ వ్య‌వ‌హారం మొత్తం ముగిశాక‌.అంద‌రూ నిద్రించారు.ఈ స‌మ‌యంలోనే బిగ్ బాస్ హౌస్‌లో దొంగ‌లు ప‌డ్డారు.

ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్‌లో బ‌య‌ట దొంగ‌లు కాదు.ఇంటి దొంగ‌లే ప‌డ్డారు.

రాత్రి పూట అంద‌రూ ప‌డుకున్నాక‌.లాస్య‌, హారిక కిచెన్‌లో దూరి పిస్తాలు దొంగ‌త‌నం చేసి తినేశారు.అనంత‌రం అక్క‌డే కూర్చుని పిస్తా తొక్క‌ల‌తో గ‌వ్వ‌లాట ఆడుకోవ‌డం మొద‌లుపెట్టారు.అయితే ఇది గ‌మ‌నించిన అఖిల్‌.

వారిద్ద‌రిని భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.ఆ త‌ర్వాత ఈ ముగ్గురినీ కెప్టెన్ నోయ‌ల్ భ‌యపెట్టాడు.

అనంత‌రం న‌లుగురు క‌లిసి కిచెన్‌లో ఉండే వ‌స్తువుల‌ను తిన‌డం మొద‌ల‌పెట్టారు.ఇక ఇంత‌లోనే వ‌చ్చిన దివి కూడా వాళ్ల‌తో జాయిన్ అయ్యి నచ్చిన‌వ‌న్నీ తినేసింది.మొత్తానికి ఇంటి స‌భ్యులే దొంగ‌లుగా మారి.కావాల్సినవి లాగించేశారు.

కాగా, ఈ వారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు నామినేష‌న్స్‌లో ఉన్నారు.మ‌రి వీరిలో ఏవరు ఈ వారం ఎలిమినేట్ అవుతాడో చూడాలి.

#Noel #Bigg Boss House #Bigg Boss 4 #Thieves #Lasya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thieves Broke Into Bigg Boss House Related Telugu News,Photos/Pics,Images..