అమ్మ బాబోయ్ : కేవలం 500 రూపాయలకే కొత్త ఎల్ఈడి టీవీ... కానీ...

పరుల సొమ్ము పాము వంటిదని పెద్దలు ఊరికే అనలేదు.ఎందుకంటే మనది కాని సొమ్ము ఎప్పుడైనా సరే మనకి హాని చేస్తుందని మరోసారి నిరూపితం అయింది.

 Thief Try To Sell Led Tv For Only 500 Rs In Telangana-TeluguStop.com

తాజాగా ఓ వ్యక్తి లక్షల రూపాయలు విలువ చేసే టీవీలను దొంగలించి కేవలం అయిదు వందల రూపాయలకే ఎల్ఈడి టీవీ ని అమ్ముతుండగా పోలీసులకు చిక్కిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే ఓ వ్యక్తి విజయవాడ పరిసర ప్రాంతంలో పలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొని ఇంటికి తీసుకెళ్లేందుకుగాను ఆటోలో ఎక్కించాడు.

 Thief Try To Sell Led Tv For Only 500 Rs In Telangana-అమ్మ బాబోయ్ : కేవలం 500 రూపాయలకే కొత్త ఎల్ఈడి టీవీ… కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది గమనించిన ఓ వ్యక్తి ఎలక్ట్రానిక్ వస్తువులను నింపిన ఆటోతో సహా జంప్ అయ్యాడు.దీంతో సదరు యజమాని దగ్గర ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశాడు.

అయితే  వస్తువులు ఉన్నటువంటి ఆటోని దొంగలించిన వ్యక్తి ఆ వస్తువులను హైదరాబాద్ లో విక్రయించేందుకు పయనమయ్యాడు. ఈ క్రమంలో దారి మధ్యలో డీజిల్ అయిపోయింది.దీంతో కనీసం డీజిల్ నింపడానికి కూడా దొంగ చేతిలో డబ్బులు లేవు.ఈ క్రమంలో ఎల్ఈడి టీవీని అమ్మేసి వచ్చిన డబ్బుతో డీజిల్ కొట్టించాలని పన్నాగం పన్నాడు.

చివరికి ఈ పన్నాగమే అతడిని పోలీసులకు పట్టించింది. ఎలాగంటే దారి గుండా వెళుతున్న కొందరు వ్యక్తులను దొంగ కేవలం 500 రూపాయలు ఇస్తే 15 వేల రూపాయల విలువ చేసే ఎల్ఈడి టీవీ ఇస్తానని కొంతమందిని అడిగాడు.

 దీంతో అనుమానం వచ్చిన స్థానికులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించగా మఫ్టీలో వచ్చిన పోలీసులు దొంగని విచారించగా అసలు విషయం బయట పడింది.దీంతో విజయవాడ పోలీసులకు సమాచారం అందించి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులను అప్పజెప్పారు.

#LEDTV #ThiefTry #ThiefStooled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు