కాళ్ళు మొక్కుతాడు దొంగతనం చేస్తాడు.. ఎలా అంటే?  

Thief Gang Arrested in Delhi,namaste gang,arrested,delhi,Chand Mohammad,dinesh kumar - Telugu Arrested, Chand Mohammad, Delhi, Dinesh Kumar, Namaste Gang, Thief Gang Arrested In Delhi

సాధారణంగా దొంగలు ఇళ్లలో ఎవరూ లేని సమయం చూసి ఆ ఇంటిలో దొంగతనానికి పాల్పడతారు.మరికొందరు ఇంటికి కన్నాలు వేసి ఇంట్లోవాళ్ళని బెదిరించి ఇంట్లో ఉన్న సొమ్మును తీసుకెళతారు, మరికొందరు దారిన కాపు కాచి దారి వెంట వెళ్లే వారిని బెదిరించి సొమ్మును దోచుకు వెళ్తారు.

TeluguStop.com - Thief Namasthe Gang Arrested Delhi

ఇలాంటి దొంగతనాలను మనం సాధారణంగా చూస్తూ ఉంటాం.కానీ ఓ దొంగ తన తెలివితేటలను ప్రదర్శించి ఎంతో చాకచక్యంగా దొంగతనానికి పాల్పడుతున్నాడు.

హ‌ర్యానా రాష్ట్రం, ఫ‌రీదాబాద్ జిల్లాకు చెందిన చాంద్ మహమ్మద్ అనే వ్యక్తి ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతాడు.తన దొంగతనం చేయాలనుకునే వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు అతనికి రెండు చేతులను జోడించి నమస్కారం చేస్తాడు.

TeluguStop.com - కాళ్ళు మొక్కుతాడు దొంగతనం చేస్తాడు.. ఎలా అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

వీలుకాకపోతే కాళ్ల మీద పడి దండం పెట్టి, ఆ వ్యక్తి దగ్గరి బంధువు కు లేదా స్నేహితుడికి బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా వారిని నమ్మించి, వారితో పరిచయం పెంచుకుంటాడు.తరువాత వారి దగ్గర ఉన్న బంగారం లేదా వస్తువులను ఒకసారి చూసి ఇస్తానని చెప్పి వాటిని తీసుకొని పారిపోతుంటాడు.

చాంద్ మహమ్మద్ ఒక దొంగల ముఠా ను మెయింటైన్ చేస్తూ, ఆ గ్యాంగ్ కి సూత్రధారిగా వ్యవహరిస్తుంటారు.నమస్కారం పెట్టి దొంగతనానికి పాల్పడటం వల్ల ఈ గ్యాంగ్ కి నమస్తే గ్యాంగ్ అనే పేరు వచ్చింది.

అయితే చాంద్ కదలికలపై గత కొద్దిరోజుల నుంచి నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.అంతేకాకుండా చాంద్ దొంగతనం చేసిన నగలు కొనే వ్యాపారి దినేష్ కుమార్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మైదాన్‌గ‌ర్హి పోలీసులు చాంద్ మహమ్మద్ ను అరెస్టు చేసి అతనిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.2017 నుంచి సంగ‌మ్ విహార్, గోవింద్‌పురి, పలు ప్రాంతాలలో దొంగతనానికి పాల్పడేవారిని పోలీసులు తెలియజేశారు.

#ThiefGang #Chand Mohammad #Delhi #Namaste Gang #Arrested

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thief Namasthe Gang Arrested Delhi Related Telugu News,Photos/Pics,Images..